Minister Daughter Elopes: తమిళనాడులో ఓ మంత్రి కుమార్తె ప్రేమ వివాహం హాట్ టాపిక్‌గా మారింది. పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా ఇంటి నుంచి వెళ్లిపోయి తాను ప్రేమించిన వ్యక్తిని ఆమె వివాహం చేసుకున్నారు. వివాహానంతరం తమకు రక్షణ కల్పించాలంటూ బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు. ఓవైపు తన కుమార్తె కిడ్నాప్‌కు గురైందేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తూ సదరు మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో ఆ మంత్రి కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకుని పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి పి.శేఖర్ బాబు కుమార్తె జయకల్యాణి (24) సతీష్ (27) అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని విజయానగర్ జిల్లాలోని హలస్వామి మఠంలో హిందూ సాంప్రదాయ పద్దతిలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం ఈ జంట మీడియాకు ఓ వీడియో సందేశాన్ని పంపించారు. అందులో జయకల్యాణి మాట్లాడుతూ.. 'సతీష్, నేను ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో నుంచి బయటకొచ్చేశాం. మేమిద్దరం మేజర్స్. పరస్పర అంగీకారంతోనే ఈ పెళ్లి చేసుకున్నాం.' అని పేర్కొన్నారు. అంతేకాదు, సతీష్ కుటుంబాన్ని బెదిరించవద్దంటూ తన తండ్రి శేఖర్ బాబుకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు జయకల్యాణి తండ్రి పి.శేఖర్ తన కుమార్తె కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతలోనే జయకల్యాణి, తన భర్త సతీష్‌తో కలిసి బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. తమిళనాడులో అయితే తన తండ్రి పలుకుబడి కారణంగా పోలీసులు తమకు రక్షణ కల్పించే పరిస్థితి ఉండదన్నారు. అందుకే బెంగళూరు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.
కాగా, జయకల్యాణి వృత్తి రీత్యా డాక్టర్. సతీష్ ప్రస్తుతం వ్యాపార రంగంలో ఉన్నాడు. జయకల్యాణి ప్రేమ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఆమెను ఓ సంపన్న కుటుంబానికి కోడలిగా చేయాలని భావించారు. ఆ మేరకు ఓ సంబంధం కూడా చూశారు. కానీ జయకల్యాణి మాత్రం సతీష్‌నే పెళ్లి చేసుకుంటానని చెబుతూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. చెప్పినట్లుగానే సతీష్‌ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇంట్లో వాళ్ల నుంచి ఇబ్బందులు ఎదురువుతాయనే భయంతో పోలీసులను ఆశ్రయించారు.
Also Read: Devineni Uma Arrest: వరుసగా రెండో రోజు ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ హౌస్ అరెస్టు.. కారణమిదే!
Also Read: AP Weather Report: వాతావరణ శాఖ రిపోర్ట్.. రానున్న మూడు రోజుల్లో మార్పులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook