న్యూఢిల్లీ: నాలుగో విడత లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పలు రాష్ట్రాలు భారీ సడలింపులను ప్రకటించనున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు అధికంగా ఉంటాయని, ఇక లాక్డౌన్ lockdown 4.0 మార్గదర్శకాలపై కేంద్రం ఎలాంటి నిబంధనలతో ముందుకొస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువగా అవుతున్న తరుణంలో, ఇప్పటికీ నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నేటితో మూడో విడత లాక్ డౌన్ ముగియనుండగా, తాజాగా నాలుగో విడత లాక్ డౌన్ ప్రకటించారు.
Also Read: ఆ రెండు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల వివాదం ఇప్పట్లో ముగిసేనా?
మరోవైపు తమిళనాడు, మహారాష్ట్రలో Covid-19 కేసులు పెరుగుతుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను మే 31 వరకు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ కాగా, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Also Read:Also Read: కరోనా పోరాటయోధులకు సంఘీభావంగా పాట పాడిన ఆశాభోంస్లే, ఇతర ప్రముఖ గాయని గాయకులు...