అయోధ్య స్థల వివాదం తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ

అయోధ్య స్థల వివాదం తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ

Last Updated : Nov 9, 2019, 11:12 AM IST
అయోధ్య స్థల వివాదం తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ

న్యూ ఢిల్లీ: అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై ఇంకొద్దిసేపట్లోనే సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించనుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వనుంది. అక్టోబర్ 16న ఈ కేసులో వాదనలు పూర్తిచేసిన సుప్రీం కోర్టు.. ఆ తర్వాత తీర్పు రిజర్వులో పెట్టిన సంగతి తెలిసిందే. నవంబర్ 8న దీనిపై ఓ ప్రకటన చేసిన సుప్రీం కోర్టు... నవంబర్ 9న తీర్పు ఇవ్వనున్నట్టు స్పష్టంచేసింది. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువడుతుందని అంతా భావించినుప్పటికీ.. తీర్పు వెల్లడించే క్రమంలో కాపీని పూర్తిగా చదివి, తీర్పు కాపీపై సంతకాలు చేసేందుకు మరో 30 నిమిషాలు పడుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ తెలిపారు. దీంతో పూర్తి తీర్పు వెలువడటం కొంత ఆలస్యమైంది.

Also read: అయోధ్య కేసు తీర్పు: అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

దశాబ్ధాల తరబడిగా ఎన్నో రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ సంచలన కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అయోధ్య, లక్నో నగరాల్లో అడుగడుగునా భద్రతను పటిష్టంచేశారు. దీంతో అయోధ్య స్థల వివాదం తీర్పుపైనే దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.

Also read : అయోధ్య తీర్పు: యూపీ సీఎస్, డీజీపీలతో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ భేటీ

 

Trending News