Supreme Court on Govt Employee Pay Scale: ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేలు తగ్గింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఓ రిటైర్డ్ ఉద్యోగి పే స్కేల్‌ను తగ్గిస్తూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఉద్యోగుల పే స్కేల్ తగ్గించడం.. వారికి అందించిన డబ్బులను తిరిగి వసూలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగి వేతన స్కేల్‌ను పునరాలోచనలో తగ్గించడం, మంజూరు చేసిన అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరడం సాధ్యం కాదని పేర్కొంది.
Also Read: MHADA Flats Lottery: రూ.40 లక్షలకే ముంబైలో ఇల్లు కొంటారా? ప్రభుత్వం అందిస్తున్న బంపర్ ఆఫర్
బీహార్‌కు చెందిన ఓ ఉద్యోగి.. 1966లో సప్లై ఇన్‌స్పెక్టర్‌గా నియతులయ్యారు. 1981 ఏప్రిల్‌లో మార్కెటింగ్ ఆఫీసర్‌గా, 1991 మార్చి 10 నాటికి 25 ఏళ్లు పూర్తికావడంతో సీనియర్ గ్రేడ్ హోదా దక్కింది. మార్కెటింగ్ ఆఫీసర్ కమ్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సప్లయ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఆయన పే స్కేలును బీహార్ సర్కారు 1999లో సవరించగా.. 1996 జనవరి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. 2001లో పదవీ విరమణ చేసిన తరువాత పెన్షన్ ఈ పే స్కేల్ ఆధారంగా ADSOగా లెక్కించి ప్రభుత్వం చెల్లించింది. అయితే 2009లో రాష్ట్ర ప్రభుత్వం బిగ్ టిస్ట్ ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం వేతన స్థిరీకరణలో పొరపాటు కారణంగా అదనపు పారితోషికాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ ఒక లేఖను రాసింది. అప్పటివరకు ఆ ఆయనకు అధికంగా దక్కిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని అధికారులను ఆదేశించింది. పొరపాటున అధిక స్కేలు దక్కినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నోటిసులపై ఉద్యోగి 2009లోనే కోర్టు మెట్లెక్కారు. ఈ ఉత్తర్వులను పట్నా హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. 2012 ఆగస్టులో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది.
హైకోర్టు తీర్పుపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించి జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం బీహార్ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసింది. పే స్కేల్‌ను తగ్గించడం, అదనపు మొత్తాన్ని రికవరీ చేయడం వంటి చర్యలు శిక్షనాత్మక చర్యలతో సమానమని స్పష్టం చేసింది. దీంతో ఆ ఉద్యోగి 15 ఏళ్ల పోరాటానికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది.
Also Read: Hyderabad: బాబోయ్.. కండక్టర్ పై కోపంతో బ్యాగ్ లోని పామును విసిరిన వృద్ధురాలు .. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.