Supreme Court: సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సుల మేరకు మరో ముగ్గురు కొత్త న్యాయమూర్తులు కొలువుదీరనున్నారు. సుప్రీంకోర్టులో ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేయాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు కొలీజియం అభిప్రాయపడింది. ముగ్గురు న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపింది సుప్రీంకోర్టు కొలీజియం. డిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అగస్టిస్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో ఉన్నారు.
ప్రతిభ, అనుభవం, విశ్వసనీయతో పాటు నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సిఫారసు చేసినట్టు కొలీజియం తెలిపింది. ఈ ముగ్గురికి కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరగనుంది.
జస్టిస్ సతీష్ చంద్ర శర్మ 2022 జూన్ 28వ తేదీన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్శిటీ నుంచి లా పట్టా పొందిన ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్న తరుణంలో న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తరువాత కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. కొద్దికాలం తెలంగాణ హైకోర్టు ఛీప్ జస్టిస్‌గా పని చేశారు.
ఇక జస్టిస్ అగస్టిస్ మసీహ్ రాజస్థాన్ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా 2023 మే 30న బాధ్యతలు స్వీకరించారు. పంజాబ్-హర్యానా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2008, జూలై 10న బాధ్యతలు తీసుకున్న ఆయన 2011, జనవరి 14న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
ఇక జస్టిస్ సందీప్ మెహతా రాజస్థాన్ బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఉంటూ రాజస్థాన్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా 2011 మే 30న బాధ్యతలు తీసుకున్నారు. 2013 ఫిబ్రవరి 6న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. ఆ తురవాత 2023 ఫిబ్రవరి 15న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
Also read: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే జైలు నుంచే పాలన సాగిస్తారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook