NEET Exam: నీట్ పరీక్ష 2021 ను వాయిదా వేయాలంటూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టి వేసింది. నీట్ పరీక్ష వాయిదా (NEET Postpone) వేయడం కుదరదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 12న నీట్ పరీక్ష జరిగి తీరుతుందని సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది.
CBSE కంపార్ట్‌మెంట్, ప్రైవేట్ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు నీట్ పరీక్ష(NEET Exam 2021)ను వాయిదా వేయాలని, కొత్త డేట్‌ను ప్రకటించాలంటూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, న్యాయస్థానం వారి వాదనలను తోసిపుచ్చింది. సెప్టెంబర్ 12న షెడ్యూల్ ప్రకారం నీట్ పరీక్ష 2021 జరుగుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే 16 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పుడు కొందరు విద్యార్థుల కోసం దాన్ని వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది. ‘ఈ పిటిషన్‌ను మేం ఆమోదించలేం. అనిశ్చితి వద్దని మేం కోరుకుంటున్నాం. పరీక్షను కొనసాగిస్తున్నామని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది.
నీట్ 2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు గతంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఈ అంశంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ కొన్ని రోజుల క్రితం స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ NEET 2021 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. సెప్టెంబర్ 9 నీట్ పరీక్ష అడ్మిట్ కార్డులు విద్యార్థులకు అందుబాటులో ఉండనున్నాయి.
ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..
ntaneet.nic.in అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ చేసుకోగానే మీ పేరు సరిగా ఉందా లేదా చూసుకోవాలి.
కార్డులు డౌన్‌లోడ్(Download) చేసుకొన్న తరువాత పరీక్షా కేంద్రాన్ని పరిశీలించుకోవాలి.
కేంద్రానికి సరైన సమయంలో చేరుకొనేందుకు ఏర్పాటు చేసుకోవాలి.
నీట్ ఎందుకు రాస్తారంటే..
MBET, BDS, BAMS, BSMS, BUMS మరియు BHMS లలో ప్రవేశానికి NEET 2021 నిర్వహిస్తారు. ఈ సంవత్సరం నుంచి మెడికల్ ఎంట్రన్స్(Medical entrance) స్కోర్లు కూడా BSc నర్సింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు వర్తించనున్నాయి. ఈ సంవత్సరం 16 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకోసం దరఖాస్తు చేసుకున్నారు.
13 భాషల్లో పరీక్ష నిర్వహణ
మొట్టమొదటి సారిగా నీట్(NEET) పరీక్షను 13 భాషల్లో నిర్వహిస్తోంది NTA. గతంలో ఉన్న భాషలతో పాటు తాజాగా మలయాళం, పంజాబీ కలుపుకొని 13 భాషల్లో ఈ పరీక్షలు నిర్వహించనుంది. హిందీ, పంజాబీ, అస్సామీస్, బెంగాలీ, ఒడియా, గుజరాతీ, మరాఠీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ప్రస్తుతం ఈ పరీక్ష రాసే వీలు ఉంది. నీట్ పరీక్ష దేశంలోని 198 నగరాలు, పట్టణాల్లో జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook