Summer 2023 Forecast: మార్చ్ నెల ముగిసింది. వేసవి రెండవ నెల ప్రారంభమౌతూనే ఎండల తీవ్రత కూడా పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మార్చ్ చివరి నుంచే పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. జూన్ వరకూ దేశమంతా ఎండలు భగభగమండిపోనున్నాయనే హెచ్చరికలు ఇప్పుడు ఆందోళన కల్గిస్తున్నాయి.
ఈసారి వేసవి భయపెట్టనుందా అంటే అవుననే సమధానం విన్పిస్తోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ మూడు నెలల కాలం భయంకరంగా ఉండబోతోంది. ఎండాకాలం మండేకాలంగా ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా..రానున్న కాలంలో మరింత తీవ్రంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతం తప్ప మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా తూర్పు, వాయువ్య దేశంలో వడగాలులు అత్యంత తీవ్రంగా ఉండవచ్చు.
బీహార్, జార్ఘండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వడగాలులు తీవ్రంగా ఉండవచ్చు. అయితే అదే సమయంలో దక్షిణ ద్వీపకల్పదేశంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని ఐఎండీ సూచిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరగనున్నాయి. దేశంలోని వాయువ్య, మధ్య, ద్వీపకల్ప ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చు. కానీ తూర్పు, ఈశాన్య ప్రాంతంలో తక్కువ వర్షపాతం ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే ఈసారి తక్కువే ఉండవచ్చని తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఐఎండీ సైతం కొన్ని సూచనలు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook