Coronavirus update: ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు...

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రోజు రోజుకు విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మరో 22 పైటివే కేసులు నమోదయ్యాయని, మొత్తం కరోనా పాజిటివ్ కేసుల  సంఖ్య 258 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా తెలిపింది. అయితే 258 మందిలో

Last Updated : Mar 21, 2020, 04:53 PM IST
Coronavirus update: ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు...

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రోజు రోజుకు విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మరో 22 పైటివే కేసులు నమోదయ్యాయని, మొత్తం కరోనా పాజిటివ్ కేసుల  సంఖ్య 258 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా తెలిపింది. అయితే 258 మందిలో 39 మంది విదేశీ పౌరులున్నారని, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్రల్లో ఇప్పటివరకు నాలుగు మరణాలు నమోదైనట్లు తెలిపారు. 
మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ కొత్తగా కేసులు నమోదుకావడంతో కరోనా సంక్రమణ 22 రాష్ట్రాలకు వ్యాపించిందని అన్నారు. 

భారతదేశంలో కోవిడ్ -19 కేసులు రాష్ట్రాల వారిగా ఇలా ఉన్నాయి. 

మహారాష్ట్ర

అత్యధికంగా కోవిడ్ -19 కేసుల సంఖ్య మహారాష్ట్రలో నమోదయ్యాయి.  సోకిన వారి సంఖ్య 63 కి పెరిగింది, ఇది ను నివేదిస్తూనే ఉంది. శుక్రవారం రాత్రి అందిన సమాచారం మేరకు 63 కేసులు నమోదయ్యాయని, ముంబై నుండి మరో 10, పూణే నుండి ఒకరు పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో ఎనిమిది మంది విదేశీయులున్నారని, ముగ్గురు భారతీయులకు వారి నుండి సోకిందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. 

కేరళ

మహారాష్ట్ర తరువాత కేరళలో కరోనావైరస్ అధికంగా ఉంది. ఇద్దరు విదేశీయులతో సహా 40 కేసులు నమోదయ్యాయని, కొత్తగా 12 కేసులు నమోదవ్వగా వీరిలో ఏడుగురు, ఐదుగురు విదేశీ పౌరులు ఉన్నారని, ముగ్గురు వ్యక్తులు కోలుకున్నారని,కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. 

ఉత్తర ప్రదేశ్

దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం నాటికి 24 మందికి కరోనావైరస్ సోకిందని, వారిలో ఒకరు విదేశీయుడు కాగా మిగిలనవారందరు భారతీయులేనని తెలిపారు. 

Read Also: కరోనా వైరస్''పై రైల్వే శాఖ నిర్లక్ష్యం

ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో 26 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, ఐదుగురు దీని బారినుండి కోలుకున్నారని తెలిపారు. 

రాజస్థాన్

ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే రాజస్థాన్ లో కూడా వ్యాప్తి అధికంగానే ఉంది. 23 మందికి పాజిటివ్ అని తేలగా ఇద్దరు విదేశీయులున్నారని, ముగ్గురు వ్యక్తులు దీని నుండి కోలుకున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

హర్యానా

హర్యానాలో కరోనావైరస్ 20 మందికి సోకగా అందులో 14 మంది విదేశీయులున్నారని కాగా ఇప్పటివరకు మొత్తంలో కోలుకోవడం కానీ మరణాలు సంభవించలేదన్నారు. 

తెలంగాణ
తెలంగాణలో ఇప్పటివరకు 19 మందికి కోవిడ్ -19 అని తేలగా వారిలో 11 మంది విదేశీయులు ఉన్నారని, ఒక రోగి కోలుకొని ఇంటికి చేరుకున్నాడని తెలిపారు.  

 

Read Also: మందుబాబుల క్రమశిక్షణ 

కర్ణాటక

కర్ణాటకలో ఇప్పటివరకు 15 ధృవీకరించబడిన కేసులున్నాయని, ఒకవ్యక్తి మరణించగా మిగినవారందరు ఐసొలేషన్లో ఉంచినట్లు తెలిపారు.  

లడఖ్, జమ్మూ కాశ్మీర్
లడఖ్‌లో కోవిడ్ -19 కేసుల సంఖ్య 13కి పెరిగిందని, జమ్మూ కాశ్మీర్లో నలుగురికి వ్యక్తులకు పాజిటివ్ అని తేలినట్లు నిర్ధారించారు. 

Read Also: రజినీకాంత్ సాహస యాత్ర

గుజరాత్‌లో ఎనిమిది మందికి, మధ్యప్రదేశ్‌లో నలుగురికి సోకినట్లు తెలిపారు. తమిళనాడులో ముగ్గురికి పాజిటివ్ అని తేలగా ఒక వ్యక్తికి నయమయ్యిందని, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ ల్లో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. పంజాబ్‌లో ఇద్దరికి సోకగా ఒక వ్యక్తి మరణించాడని, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ లలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాని తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News