అయోధ్య వివాదంపై స్పందించిన శ్రీ శ్రీ పండిట్ రవిశంకర్

అయోధ్య వివాదంపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంర్ స్పందించారు.

Last Updated : Mar 1, 2018, 12:45 PM IST
అయోధ్య వివాదంపై స్పందించిన శ్రీ శ్రీ పండిట్ రవిశంకర్

అయోధ్య వివాదంపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ స్పందించారు. అయోధ్య వివాదం కోర్టులో తేలేది కాదని, ఆ వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుంటే మేలని అభిప్రాయపడ్డారు. అయోధ్య వివాదానికి దూరంగా ఉండాలని పండిట్ శ్రీశ్రీ రవి శంకర్ ను బాబ్రీ యాక్షన్ కమిటీ కోరిన నేపథ్యంలో, ఆయన పైవిధంగా స్పందించారు. అయోధ్య వివాదాన్ని ముస్లింలు కూడా పెద్దగా వ్యతిరేకించడం లేదని రవిశంకర్ అభిప్రాయపడ్డారు.

నేడు లక్నోలో మౌలానా నద్వితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీ శ్రీ, 'ఇరువర్గాల వారితో మేము శాంతియుతంగా, సామరస్యంగా అయోధ్యలో రామమందిరం నిర్మాణం గురించి మాట్లాడుతున్నాం. ముస్లింలతో పాటు అందరూ చక్కగా సహకరిస్తున్నారు' అని అన్నారు.

 

 

అంతకుముందు అయోధ్య వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకుంటేనే మేలని, లేకపోతే కోర్టులో కేసు ఓడిపోయిన వారు మొదట ఆ తీర్పుకు అంగీకరించినా.. ఆ తరువాత దేశంలో గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉందని అన్నారు. సుప్రీంకోర్టు అయోధ్య కేసుకు సంబంధించిన తుది విచారణను గత సంవత్సరం డిసెంబర్ 5న ప్రారంభించిన సంగతి తెలిసిందే..!

Trending News