క్రియ సమాధి పద్ధతిలో శ్రీ శివకుమార స్వామి అంత్యక్రియలు పూర్తి

కన్నడీగుల ప్రత్యక్ష దైవంగా భావించే సిద్ధగంగ మఠం అధిపతి శ్రీ శివకుమార స్వామి అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య వీరశైవ / లింగాయత్ సంప్రదాయాన్ని అనుసరించి క్రియ సమాధి పద్ధతిలో శ్రీ శివకుమార స్వామి అంత్యక్రియలు నిర్వహించారు.

Last Updated : Jan 23, 2019, 12:19 PM IST
క్రియ సమాధి పద్ధతిలో శ్రీ శివకుమార స్వామి అంత్యక్రియలు పూర్తి

బెంగళూరు: కన్నడీగుల ప్రత్యక్ష దైవంగా భావించే సిద్ధగంగ మఠం అధిపతి శ్రీ శివకుమార స్వామి అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య వీరశైవ / లింగాయత్ సంప్రదాయాన్ని అనుసరించి క్రియ సమాధి పద్ధతిలో శ్రీ శివకుమార స్వామి అంత్యక్రియలు నిర్వహించారు. తన మరణం అనంతరం తనకు ఎక్కడైతే అంత్యక్రియలు నిర్వహించాలని శ్రీ శివకుమార స్వామి సూచించారో.. ఆ ప్రదేశంలోనే ఆయనను సమాధి చేశారు. మంగళవారం ఉదయం నుంచి ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు ప్రారంభం కాగా సాయంత్రానికి ఈ అంత్యక్రియలు ముగిశాయి. 

శ్రీ శివకుమార స్వామి అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రముఖులు, భక్తులు, ప్రజలు తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.

Trending News