కేంద్ర కేబినెట్ సమావేశంలో సోషల్ డిస్టన్స్

'కరోనా వైరస్'కు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు.  21 రోజులపాటు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి. 

Last Updated : Mar 25, 2020, 02:16 PM IST
కేంద్ర కేబినెట్ సమావేశంలో  సోషల్ డిస్టన్స్

'కరోనా వైరస్'కు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు.  21 రోజులపాటు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి.  

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ మరోసారి కరోనా వైరస్ పై  సమీక్ష నిర్వహించారు. కేంద్ర కేబినెట్ లో ఈ అంశంపై చర్చించారు. పలువురు మంత్రులతో కరోనా వైరస్ పరిస్థితిపై  ఆరా  తీశారు. లాక్ డౌన్ కారణంగా  నిత్యావసర సరుకులు,  అత్యవసర సేవలకు ఇబ్బంది  రాకుండా చూడాలని ఆదేశించారు. 

'లాక్ డౌన్' వేళ స్పెయిన్ పోలీసులు ఏం చేస్తున్నారో తెలుసా..?

మరోవైపు కేంద్ర కేబినెట్ సమావేశం ఎప్పటిలా  కాకుండా కాస్త భిన్నంగా జరిగింది. ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్ లోని  ప్రధాని ఇంట్లో జరిగిన సమావేశంలో సోషల్ డిస్టన్స్ పాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కూర్చోగా.. ఆయన  చుట్టూ కేంద్ర మంత్రులు సరైన  దూరంలో కుర్చీల్లో కూర్చున్నారు. దాదాపు 2  అడుగులపైన వారి మధ్య దూరం ఉండడం విశేషం.

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News