'కరోనా'పై గాయని పాటను ప్రశంసించిన మోదీ

'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తుంటే.. ప్రముఖ జానపద గాయని మాలిని అవస్తి.. కరోనా వైరస్ పైనే పాట రూపొందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అనుగుణంగా పాట తయారు చేసి పాడారు.

Last Updated : Mar 22, 2020, 04:10 PM IST
'కరోనా'పై గాయని పాటను ప్రశంసించిన మోదీ

'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తుంటే.. ప్రముఖ జానపద గాయని మాలిని అవస్తి.. కరోనా వైరస్ పైనే పాట రూపొందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అనుగుణంగా పాట తయారు చేసి పాడారు. 

'కరోనా వైరస్' ఇతి  వృత్తంగా తీసుకుంటూనే.. అంతర్లీనంగా జాగ్రత్తల గురించి చెప్పుకుంటూ వచ్చారు.  దీనికి మంచి ట్యూన్ తోడు కావడంతో పాట చాలా  బాగా వచ్చింది. ఈ పాటను ఆమె స్వయంగా  పాడారు. అలా పాడుతున్న సమయంలో చేసిన వీడియోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ ట్వీట్ ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్  చేయడం విశేషం. 

10 నిముషాల్లోనే ''కరోనా వైరస్'' పరీక్ష..!!

Read Also: మార్చి 31 వరకు రైలు ప్రయాణం బంద్

'కరోనా వైరస్'  ప్రచారం చేయడం అందరి  బాధ్యత అని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు  చేశారు. ఐతే వాల్ పోస్టర్లు, నోటి మాటల ద్వారా కంటే .. పాట ద్వారా ప్రచారం  చేస్తే .. ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు. మాలిని అవస్తి చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News