EPFO Balance Check: ఆన్ లైన్ సెర్చులు చేస్తూ సమయం వేస్ట్ చేసుకునే టైం గడిచిపోయింది. సాధారణంగా అందరు ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఉంటుంది. అయితే, ఎప్పుడైనా బ్యాలన్స్ చెక్ చేసుకోవాలంటే సర్వర్ డౌన్ అవ్వడం లేదా ఇతరేతర కారణాల వల్ల ఇబ్బందిగా మారుతుంది.
అయితే ఇంట్లోనే ఉంటూ సులభంగా పీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేసుకునే సౌలభ్యం ఉందని మీకు తెలుసా? కేవలం టెక్ట్స్ మెసేజ్ ఆధారంగా కూడా పీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం.
1. ఎస్ ఎం ఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలన్స్ చెక్..
దీనిద్వారా మీ మొబైల్ ఫోనుకు నేరుగా పీఎఫ్ బ్యాలన్స్ అకౌంట్ తెలుసుకోవచ్చు. ఫోన్ ద్వారా పీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేయాలంటే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి EPFOHO , UAN నంబర్ టైప్ చేసి 7738299899 నంబర్ కు ఎస్ ఎం ఎస్ పంపండి.
2. మిస్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేయండి..
మిస్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మీ పీఎఫ్ బ్యాలన్స్ ను చెక్ చేసుకోవచ్చు.
దీనికి సింపుల్ గా 9966044425 నంబర్ కు మీ రిజిస్టర్ మొబైల్ నుంచి మిస్ కాల్ ఇవ్వండి వెంటనే మీ మొబైల్ ఫోన్ కు మీ ఎఫ్ అకౌంట్ బ్యాలన్స్ మెసేజ్ వస్తుంది.
౩. ఉమంగ్ యాప్ ద్వారా ...
ఉమంగ్ యాప్ ద్వారా కూడా ఉద్యోగులు తమ PF బ్యాలెన్స్‌ని సులభంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా యూనిఫైడ్ పోర్టల్ ద్వారా కూడా పీఎఫ్ అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు. దీనికి మీ వద్ద యూఏఎన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి పాస్ బుక్ ద్వారా పీఎఫ్ బ్యాలన్స్ తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం మన పీఎఫ్ డబ్బులకు వడ్డీని ఎప్పటికప్పుడు జమా చేస్తుంది.
ఇదీ చదవండి: Budget 2024: నీలిరంగు చీరలో నిర్మలమ్మ.. ఇవి ఫైనాన్స్ మినిస్టర్ శారీ కలెక్షన్స్ ..
ఇదీ చదవండి: LPG Price Hike: బడ్జెట్ ముందే సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook