Amritpal Singh: 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్ట్

Amritpal Singh: ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ను ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. పంజాబ్‌లోని మోగా పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2023, 08:54 AM IST
Amritpal Singh: 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్ట్

Amritpal Singh Arrest: ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఆదివారం తెల్లవారుజామున పంజాబ్‌లోని మోగా పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. అమృతపాల్ ను అస్సాంలోని దిబ్రూఘర్ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేశారు. పంజాబ్ పోలీసులు మరియు జాతీయ ఇంటెలిజెన్స్ సంయుక్త ప్రయత్నాల ద్వారా ఇది జరిగింది.

అమృతపాల్ సింగ్ యొక్క మరో ఇద్దరు సన్నిహితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 15న అతని సన్నిహితుడు జోగా సింగ్‌ను ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్ లో అరెస్ట్ చేయగా.. మరో సహాయకుడు పాపల్‌ప్రీత్ సింగ్‌ను ఏప్రిల్ 10న అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ మరియు ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో వీరి అరెస్ట్ లు జరిగాయి. 

Also Read: Amit Shah: ఇవాళ చేవెళ్లలో 'విజయ సంకల్ప సభ'.. స్పెషల్ ఎట్రాక్షన్ గా అమిత్ షా..

దాదాపు నెల రోజుల క్రితం, పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్‌ సింగ్‌ పై లుక్‌అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) మరియు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యు) జారీ చేశారు. అప్పటి నుంచి అతడి కోసం పంజాబ్ పోలీసులు వేట ప్రారంభించారు. అమృత్ మార్చి 18 నుండి పరారీలో ఉన్నాడు.

అమృత్ పాల్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను పంజాబ్‌ పోలీసులు ఓ కిడ్నాప్‌ కేసులో ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 23న అమృత్‌పాల్‌ అనుచరులు అమృత్‌సర్‌ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి తెగబడ్డారు. అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read: Karnataka Elections: సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు హ్యాండిచ్చిన బీజేపీ.. అసలు కారణం చెప్పిన అమిత్ షా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News