Shaheen Cyclone: ఏడు రాష్ట్రాలవైపుకు దూసుకొస్తున్న షహీన్ తుపాను

Shaheen Cyclone: మొన్న బంగాళాఖాతంలో గులాబ్ తుపాను. ఇప్పుడు షహీన్ తుపాను. అరేబియా సముద్రంలో బలపడుతున్న షహీన్ తుపాను ఏకంగా ఏడు రాష్ట్రాలపై ప్రభావం చూపవచ్చనే హెచ్చరికలు వస్తున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 2, 2021, 07:32 AM IST
  • దూసుకొస్తున్న షహీన్ తుపాను, పాకిస్తాన్ లోని మాక్రన్ వద్ద తీరాన్ని తాకే అవకాశం
  • ఇండియాలో ఏడు రాష్ట్రాలపై షహీన్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు
  • అరేబియా సముద్రంలో క్రమంగా బలపడుతున్న షహీన్ తుపాను
Shaheen Cyclone: ఏడు రాష్ట్రాలవైపుకు దూసుకొస్తున్న షహీన్ తుపాను

Shaheen Cyclone: మొన్న బంగాళాఖాతంలో గులాబ్ తుపాను. ఇప్పుడు షహీన్ తుపాను. అరేబియా సముద్రంలో బలపడుతున్న షహీన్ తుపాను ఏకంగా ఏడు రాష్ట్రాలపై ప్రభావం చూపవచ్చనే హెచ్చరికలు వస్తున్నాయి.

అక్టోబర్ నెల వచ్చిందంటే చాలు తుపాన్లు మొదలవుతాయి. ప్రతి యేటా అక్టోబర్-నవంబర్-డిసెంబర్ నెలల్లో ఇదే పరిస్థితి. ఇప్పుడు మరో తుపాను ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో కలకలం రేపిన గులాబ్ తుపాను(Gulab Cyclone)నుంచి తేరుకునేలోగా షహీన్ తుపాను ముంచుకొస్తోంది. ఈసారి అరేబియా సముద్రం తీరాన్ని వణికిస్తోంది. అరేబియా సముద్రంలో(Arabian Sea)ఏర్పడిన షహీన్ తుపాను క్రమంగా బలపడుతోంది. ఈ తుపాను ప్రభావం ఏకంగా ఏడు రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో షహీన్ తుపాను కారణంగా రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుపాను(Shaheen Cyclone)మధ్య అరేబియా తీర ప్రాంతాలవైపుకు దూసుకొస్తోంది. క్రమంగా ఇది తీవ్ర తుపానుగా మారి పాకిస్తాన్‌లోని(Pakistan) మాక్రన్ తీర ప్రాంతాన్ని తాకనుంది. అనంతరం 36 గంటల్లో దిశ మార్చుకుని గల్ఫ్ ప్రాంతాలవైపుకు కదులుతుంది. క్రమంగా బలహీనపడుతుందని ఐఎండీ (IMD)వెల్లడించింది. గులాబ్ తుపాను కారణంగానే షహీన్ తుపాను ఏర్పడిందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఏడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని..తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Also read: India's tit for tat to UK: యూకేకు గట్టిగా బుద్ధి చెప్పిన భారత్.. వాళ్లకు ఇక Quarantine తప్పనిసరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News