'కరోనా వైరస్'. . ప్రపంచవ్యాప్తంగా దేనినీ వదలడం లేదు. ఇందుగలడందు లేదను సందేహం వలదు.. ఎందెందు వెదకి చూచినా .. అందందే కలదు 'కరోనా వైరస్'.. అనేలా పరిస్థితి తయారైంది. కరోనా వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు సైతం నేల చూపులు చూస్తున్నాయి. ఒక్క భారత స్టాక్ మార్కెట్లే కాదు. . ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి.
Read Also: అన్ని హ్యాండ్ శానిటైజర్లు ఒకేలా ఉండవు..!!
ఒకవైపు కరోనా.. మరోవైపు ఆర్ధిక మాంద్యం.. ఇంకోవైపు క్రూడ్ ఆయిల్ రేట్ల పతనం. . ముప్పేట తగులుతున్న దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈక్విటీలు నేల చూపులు చూస్తున్నాయి. మొత్తంగా స్టాక్ మార్కెట్ల సూచీలన్నీ రెడ్ కలర్ లోనే కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం నష్టాలతోనే ప్రారంభమైన దళాల్ స్ట్రీట్. . చివరి వరకు అదే పంథాను కొనసాగించాయి. ఓ దశలో బాంబే స్టాక్ ఎక్చేంజీ..BSE 2,800 పాయింట్లకు పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకుంది. కానీ చివరకు 2వేల 713 పాయింట్లు కోల్పోయి 31 వేల 390 వద్ద స్థిరపడింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్చేంజీ..NIFTY కూడా అదే పరిస్థితిలో 757 పాయింట్లు నష్టపోయి 9 వేల 197 పాయింట్ల వద్ద ముగిసింది.
Read Also: 'కమలం'పై కేసీఆర్ కన్నెర్ర
ఎన్ఎస్ఈలో జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఇండస్ బ్యాంక్, వేదాంత, హెచ్ డీఎఫ్ సీ కంపెనీల ఈక్విటీలో భారీ నష్టాలను చవి చూశాయి. ఐతే యెస్ బ్యాంక్ ఈక్విటీలు మాత్రమే లాభపడ్డాయి. గతంలో ఈ బ్యాంక్ షేర్లు పూర్తి నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఐతే ఎస్బీఐ బ్యాంక్ తోపాటు మిగతా బ్యాంకులు దీన్ని స్వాధీనం చేసుకుంటారన్న వార్తల మధ్య యెస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. మొత్తంగా ఈ షేర్లలో 46.38 శాతం పెరుగుదల కనిపించింది. ఒక్క రోజులోనే యెస్ బ్యాంక్ ఈక్విటీలు 37 రూపాయల 40 పైసలు పెరగడం విశేషం.
'కరోనా' తగ్గిస్తానంటున్న 'కంత్రీ బాబా' జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..