మోడీ సర్కార్ కు షాక్; రాఫెల్ పై విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు వెల్లడి

ఎన్నికల వేళ మోడీ సర్కార్ కు ఊహించని షాక్ తగిలింది

Last Updated : Apr 10, 2019, 11:40 AM IST
మోడీ సర్కార్ కు షాక్; రాఫెల్ పై విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు వెల్లడి

రాఫెల్ యుద్ధ వియానాల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుపై వేసిన రివ్యూ పిటిషన్లను తిరస్కరించాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. రాఫెల్ డీల్ పై వేసిన పిటిషన్లపై విచారణ కొనసాగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లు సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా విచారణ జరుగుతుందని... విచారణ తేదీని త్వరలోనే ఖరారు చేస్తామని అత్యన్నత ధర్మసనం తెలిపింది.

రాఫెల్ డీల్ పై కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్  రివ్యూ పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించ వద్దంటూ కేంద్రం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. దేశ రక్షణ రహస్యాలను బయటికి వెల్లడించలేమని కాబట్టి.. ఈ పిటిషన్లను కొట్టి వేయాలంటూ కోర్టును కేంద్రం కోరింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జరీ చేసింది.

Trending News