ఎస్‌బీఐ ఖాతాదారులకు ఊరట

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదారులకు ఊరటనిచ్చింది.

Last Updated : Mar 13, 2018, 01:46 PM IST
ఎస్‌బీఐ ఖాతాదారులకు ఊరట

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదారులకు ఊరటనిచ్చింది. సేవింగ్స్ అకౌంట్ లో కనీస నగదు నిల్వలు(మినిమన్ బ్యాలెన్స్) లేకపోతే విధించే జరిమానాను భారీగా తగ్గించింది.

ప్రస్తుతం మెట్రో, అర్బన్‌ కేంద్రాల్లోని ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాల్లో మినిమన్ బ్యాలెన్స్ లేని ఖాతాదారుల నుంచి నెలకు రూ.50+జీఎస్‌టీ చొప్పున, గ్రామాలు, పట్టణాలలో రూ.40+జీఎస్‌టీ చొప్పున ఖాతాదారుల నుంచి వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఛార్జీలను 75శాతం వరకు తగ్గించింది.

దీని ప్రకారం.. ఇకపై మెట్రో, అర్బన్‌ కేంద్రాల్లోని ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాల్లో మినిమన్ బ్యాలెన్స్ లేకపోతే రూ.15+ జీఎస్‌టీ చొప్పున, పట్టణాలలో అయితే రూ.12+ జీఎస్‌టీ, గ్రామీణ ప్రాంతాల్లో రూ. రూ.10+జీఎస్‌టీ చొప్పున చార్జీలు వసూలు చేయనున్నట్లు ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. సవరించిన ఛార్జీలు ఏప్రిల్‌ 1, 2018 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. తాజాగా సవరించిన ఛార్జీలు ఏప్రిల్‌ 1, 2018 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.

 

Trending News