SBI Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఎస్‌బీఐలో 5,008 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రేపే చివరి తేదీ..

SBI Recruitment 2022: బ్యాంక్‌ పరీక్షలు రాసే అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న జూనియర్ అసోసియేట్స్ నోటిఫికేషన్ ను ఎస్‌బీఐ రిలీజ్ చేసింది. పూర్తి వివరాలు మీ కోసం..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 26, 2022, 11:31 AM IST
SBI Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఎస్‌బీఐలో 5,008 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రేపే చివరి తేదీ..

SBI Recruitment 2022: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ స్పోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 5008 ఖాళీలను భర్తీ చేయనున్నారు. రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఎస్బీఐ వెబ్‌సైట్ sbi.co.in, ibpsonline.ibps.in పోర్టల్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.  

ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ అర్హతతో ఖాళీగా ఉన్న 5008 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో 243 పోస్టులు జనరల్ కేటగిరీకి, 1165 పోస్టులు ఇతర వెనుకబడిన తరగతులకు, 490 పోస్టులు ఆర్థికంగా బలహీన వర్గాలకు, 743 పోస్టులు షెడ్యూల్డ్ కులాలకు, 467 షెడ్యూల్డ్ తెగలకు కేటాయించారు. జనరల్ / ఓబీసీ /ఈడబ్యూసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 750 గా నిర్ణయించగా... ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్‌లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?
>> ముందుగా అధికారిక వెబ్‌సైట్ sbi.co.inకి వెళ్లండి.
>> వెబ్‌సైట్ హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) లింక్‌ను క్లిక్ చేయండి. అప్పుడు లాగిన్ అడుగుతుంది. వెంటనే లాగిన్ అవ్వండి. 
>> అనంతరం అప్లికేషన్ ఫారమ్ నింపి ఫీజు చెల్లించండి. 
>> అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తును పూర్తి చేయండి.
>> తర్వాత ఫ్రింట్ అవుట్ తీసుకుని మీ వద్ద ఉంచుకోండి. 

Also Read: Kullu road accident: కులులో ఘోర ప్రమాదం... లోయలో పడిన టెంపో.. ఏడుగురు టూరిస్టులు దుర్మరణం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News