Satyendra Jain Arrest: ఇదో ఫేక్ కేసు... రాజకీయ దురుద్దేశంతోనే అరెస్ట్.. సత్యేంద్ర అరెస్టుపై కేజ్రీవాల్

Satyendra Jain Arrest: మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్టుపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. జైన్‌పై పెట్టిన కేసు పూర్తిగా ఫేక్ అని... రాజకీయ దురుద్దేశంతోనే అరెస్ట్ చేశారని ఆరోపించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 31, 2022, 01:56 PM IST
  • ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్
  • మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన సత్యేంద్ర
  • సత్యేంద్ర అరెస్టుపై కేజ్రీవాల్ ఫైర్
Satyendra Jain Arrest: ఇదో ఫేక్ కేసు... రాజకీయ దురుద్దేశంతోనే అరెస్ట్.. సత్యేంద్ర అరెస్టుపై కేజ్రీవాల్

Satyendra Jain Arrest: ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్టు విషయంలో కేంద్రంపై ఫైర్ అయ్యారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. రాజకీయ దురుద్దేశంతోనే సత్యేంద్ర జైన్‌ను అరెస్ట్ చేయించారని... ఆయనపై పెట్టిన కేసు పూర్తిగా ఫేక్ అని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీ గల రాజకీయ పార్టీ అని పునురుద్ఘాటించారు. సత్యేంద్ర జైన్ పెట్టిన కేసులో ఒక్క శాతం ఆధారాలున్న ఆయనపై తానే స్వయంగా చర్యలు తీసుకునేవాడినని పేర్కొన్నారు.

సత్యేంద్ర జైన్‌పై మనీ లాండరింగ్ కేసును తాను క్షుణ్ణంగా అధ్యయనం చేశానని.. అది పూర్తిగా ఫేక్ కేసు అని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తాము అవినీతి చేయమని... ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించమని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే జైన్‌ని అరెస్ట్ చేశారని ఆగ్రహించారు. జైన్ సత్య మార్గాన్ని అనుసరిస్తున్నాడని... అతను క్లీన్‌గా బయటకొస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు.

మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సత్యేంద్ర జైన్‌ను సోమవారం (మే 30) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోల్‌కతాకు చెందిన కొన్ని సంస్థల ద్వారా సత్యేంద్ర జైన్ హవాలా లావాదేవీలు జరిపారనే ఆరోపణలపై ఈడీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. కొద్ది గంటల విచారణ తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) చట్టం కింద ఈడీ ఆయన్ను కస్టడీలోకి తీసుకుంది. 

సత్యేంద్ర జైన్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పంజాబ్ ఎన్నికల సమయంలోనే అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనడం గమనార్హం. ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఈ ఫేక్ కేసు విచారణలో సత్యేంద్రకు సంబంధించి ఎటువంటి ఆధారా లు దొరకలేదని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగానే ఈ కేసును మళ్లీ రీఓపెన్ చేశారని ఆరోపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ ఇన్‌చార్జిగా సత్యేంద్ర ఉన్నందునా... ఓటమి భయంతోనే బీజేపీ  ఆయన్ను అరెస్ట్ చేయించిందని ఆరోపిస్తోంది. 

Also Read: Budh Margi 2022: వృషభరాశిలో బుధుడి కదలిక.. జూన్ 3 నుంచి ఈ 5 రాశుల వారి కెరీర్‌ కేక!

Also Read: Sachin Tendulkar Playing XI: ధోనీ, రోహిత్, కోహ్లీ లేరు.. సచిన్ ఐపీఎల్ 2022 జట్టు ఇదే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News