Samsung: 7000mAh బ్యాటరీ బ్యాకప్‌తో మార్కెట్లోకి గెలాక్సీ M51

శాంసంగ్‌ పాపులర్‌ గెలాక్సీ ఎం సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను గురువారం లాంచ్‌ అయింది. అయితే.. ఈ సారి శాంసంగ్ ఎం51 మొబైల్‌ను భిన్నమైన రీతిలో ఆవిష్కరించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

Last Updated : Sep 10, 2020, 03:35 PM IST
Samsung: 7000mAh బ్యాటరీ బ్యాకప్‌తో మార్కెట్లోకి గెలాక్సీ M51

Samsung launches Galaxy M51: ఢిల్లీ: శాంసంగ్ (Samsung) పాపులర్‌ గెలాక్సీ ఎం సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను గురువారం లాంచ్‌ అయింది. అయితే.. ఈ సారి శాంసంగ్ ఎం51 మొబైల్‌ను భిన్నమైన రీతిలో ఆవిష్కరించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ గెలాక్సీ M51 ప్రత్యేకత ఎమిటంటే.. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్‌తోపాటు 7000mAh బ్యాటరీ బ్యాకప్‌తో తయారైన గొప్ప గెలాక్సీ ఫోన్‌గా శాంసంగ్ పేర్కొంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లల్లో వినియోగదారులకు లభించనుంది. గెలాక్సీ M51 6GB/128GB మొబైల్ ధర రూ.24,999, కాగా.. 8GB/128GB మొబైల్ ధర రూ.26,999గా శాంసంగ్ నిర్ణయించింది. అయితే.. ఈ స్మార్ట్‌ఫోన్ Amazon.in, Samsung.com, పలు రిటైల్ స్టోర్‌లల్లో సెప్టెంబరు 18 నుంచి అందుబాటులో ఉండనుంది. దీంతోపాటు ఈఎంఐ, ఐఎంఐయేతర లావాదేవీలపై 2వేల క్యాష్‌బ్యాక్‌ పొందే ఆఫర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. కానీ ఈ స్కీమ్ సెప్టెంబర్‌ 18 నుంచి సెప్టెంబర్‌ 20 మధ్యనే అందుబాటులో ఉండనుంది.  Also read: EPFO ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేటు ఫిక్స్

గెలాక్సీ M51 ఇన్-బాక్స్ టైప్ సి 25W సూపర్ ఫాస్ట్ ఛార్జర్‌తో లభించనుంది. దీని బ్యాటరీని రెండు గంటలపాటు (115మినిట్స్) ఛార్జ్ చేస్తే రెండురోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేతోపాటు..  క్వాడ్ రియర్ కెమెరా బ్యాక్-64MP, ఫ్రంట్-32MPతో లభించనుంది.  Also read: EPFO: PFను సులువుగా ఇలా విత్‌డ్రా చేసుకోండి

Trending News