Subrata Roy Death: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, కార్పొరేట్ కంపెనీ సహారా ఇండియా గ్రూప్ అధినేత 75 ఏళ్ల సుబ్రతారాయ్ గుండెపోటుతో మరణించారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..కార్డియో అరెస్ట్ కారణంగా మరణించారు.
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతారాయ్ గత కొద్దికాలంగా మెటాస్టాటిక్ ప్రాణాంతక రక్తపోటు, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలో బాధపడుతున్నారు. మొన్న ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. నిన్న రాత్రి కార్డియో అరెస్ట్ కారణంగా ప్రాణాలు వదిలారు. 1948 బీహార్ లోని అరారియాలో జన్మించిన సుబ్రతా రాయ్ 1978లో వ్యాపార రంగంలో అడుగెట్టారు. 2 వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించిన సుబ్రతా రాయ్ దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్తగా మారారు. ఓ దశలో బారతీయ రైల్వే తరువాత అంతపెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించిన సంస్థగా మారింది.
సహారా ఇండియా పరివార్ స్థాపనలో దేశంలోని టాప్ 10 ధనవంతుల్లో ఒకరిగా మారడమే కాకుండా లక్షలాదిమందికి ఉపాధి కల్పించారు. ప్రస్తుతం సహారా గ్రూప్ ఆధ్వర్యంలో హౌసింగ్, ఎంటర్టైన్మెంట్, మీడియా, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారాలు నడుస్తున్నాయి. ఆతిధ్య రంగంలో కూడా సహారాకు దేశవ్యాప్తంగా పేరుంది. దేశంలోని వివిధ నగరాల్లో హోటల్స్ ఉన్నాయి.
గతంలో సహారా ఇండియా ఐపీఎల్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది. పూణే వారియర్స్ ఇండియా పేరుతో ఓ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఆ తరువాత బీసీసీఐతో విబేధాల కారణంగా ఆ ఫ్రాంచైజీ కాస్తా రద్దయింది. గ్రో స్వెనర్ హౌస్ ఎంబీ వ్యాలిసిటీ, ప్లాజా హోటల్, డ్రీమ్ టౌన్ హోటల్స్ కూడా ఈయనవే. సుబ్రతా రాయ్ మరణం పట్ల ప్రముఖులంతా సంతాపం తెలిపారు. సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ ద్వారా సంతాపం తెలిపారు.
Also read: Heavy Rains Alert: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, ఏపీ, తమిళనాడులో బారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook