RSS:నేడు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ జయంతి.. వందేళ్ల ప్రస్థానంలో ఎన్నో మలుపులు..

RSS (Rashtriya Swamyamsevak Sangah): బిందువు, బిందువు కలిసి సింధువు అయినట్టు.. ఎపుడు 1925 విజయ దశమి రోజు కేవలం గురూజీతో కలిపి 6గురు సభ్యులతో ప్రారంభమైన  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్..  (RSS).. నేడు శాఖోపశాఖలుగా విస్తరించింది.  ప్రస్తుతం భారత రాజకీయాలను ఆర్ఎస్ఎస్‌ను వేరు చూసి చూడలేము. ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ .. పుట్టింది ఈ ఉగాది పర్వదినానే. ఆయన 99 యేళ్ల క్రితం ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ అనే చిన్న విత్తనం ఎన్నో శాఖలుగా విస్తరించింది. మొత్తంగా వందేళ్లకు చేరువుతున్న ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రస్థానంపై చిన్న ఫోకస్..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 9, 2024, 07:43 PM IST
RSS:నేడు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ జయంతి.. వందేళ్ల ప్రస్థానంలో ఎన్నో మలుపులు..

RSS (Rashtriya Swamyamsevak Sangah): ఆర్ఎస్ఎస్ భారత దేశంలో అదో సంచలనం.. మన దేశంలోని రాజకీయ పార్టీలు మంచికో.. చెడుకో  ఆర్ఎస్ఎస్ ఊసెత్తని రోజంటూ ఉండదు. 1925 సెప్టెంబర్ 25న విజయ దశమి రోజున... ఏ మూహూర్తానా డాక్టర్ కేశవ బలీరామ్ హెడ్గేవార్ ఈ సంఘాన్ని స్థాపించారో.. ఈ సంస్త ఇంతింతై అన్నట్టు దినదిన ప్రవర్దమానమైంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్గనైజేషన్‌గా పేరు పొందింది. భారత మాత సేవ కోసం పనిచేయాలనుకునే అభిమానం ఉన్న ప్రతిఒక్కరు ఇందరలో చేరవచ్చు. అందరి కోసం దేశం.. అన్నకోణంలో పుట్టికొచ్చిందే ఆర్ఎస్ఎస్.  రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘాన్ని స్థాపించిన పరమపూజనీయ డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ 1889 ఏప్రిల్ 1న విక్రమ నామ శకం ఉగాది పండగ నాడు పుణ్యదంపుతులైన తండ్రి బలీరామ్, మరియు తల్లి రేవతిలకు నాగపూర్లో జన్మించారు. వీళ్లది తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దులోని కందుకుర్తి గ్రామం. ఆ తర్వాత వీరి కుటుంబం నాగ్‌పూర్‌కు వలస వెళ్లింది.  1925లో కేవలం ఆరుగురుతో RSS సంఘ శాఖను నాగపూర్‌లో విజయ దశమి రోజున ప్రారంభించారు. అప్పట్లో చిన్నగా ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ శాఖ ప్రముఖ హిందూ జాతీయవాద సంస్థగా ఎదిగింది. అంతేకాదు సామాజిక సంస్థగా ఇప్పటికీ క్రియా శీలకంగా ఉంది. 2025 విజయ దశిమి నాటికి ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోబోతుంది.

ఆర్ఎస్ఎస్ దాదాపు కోటి మంది సేవకులతో ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా గుర్తింపు పొందింది.  దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు .. ఆర్ఎస్ఎస్ (RSS)ను మత సంస్థగా విమర్శించినా.. వాటన్నంటినీ  పక్కన పెట్టి ప్రపంచలోనే అతిపెద్ద మానవ సంస్థగా లక్షలాది ప్రజల మన్ననలు పొందిన సంస్థగా గుర్తింపు పొందింది. ఆర్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశ్యం భారతీయ సంస్కృతిని, పౌర సమాజం యెక్క విలువలను సమర్దించే ఆదర్శాలను ప్రోత్సహిస్తోంది. రెండో ప్రపంచ యుద్ద సమయంలో యూరోపియన్ మితవాద సమూహాల నుండి ప్రేరణ పొంది క్రమంగా, RSS ఒక ప్రముఖ హిందూ జాతీయవాద సంస్థగా ఎదిగింది. 1948లో గాంధీజీ హత్యకు ఆర్ఎస్‌ఎస్ సంబంధం ఉందనే ఆరోపణలతో ప్రభుత్వం ఈ సంస్థపై కొన్నాళ్లు నిషేధం విధించింది. ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేని కారణంగా నిషేధాన్ని ఎత్తేసింది. ఇక 1975 -77 ఇందిరా గాంధీ ఎమర్జన్సీ విధించిన సమయంతో పాటు 1992లో వివాదాస్పద  బాబ్రీ కట్టడం కూల్చివేత సందర్భంగా మొత్తంగా మూడు సార్లు ఆర్ఎస్ఎస్ పై నిషేధాజ్ఞాలు అమలయ్యాయి.  ఇక మన దేశంలో హిందూ  సాంస్కృతిక పునర్జీవానికి ఆర్ఎస్ఎస్ ఎంతో కృషి చేసింది.      

హిందూ జాతీయ వాద సంస్థ ఎదిగింది ఆర్ఎస్ఎస్. ముఖ్యంగా ప్రకృతి విపత్తుల సమయంలో ఆర్ఎస్ఎస్ అందించిన సేవలను ఎవరు మరిచిపోలేరు. అంతేకాదు 1962లో భారత్, చైనా యుద్ధ సమయంలో ఆర్ఎస్ఎస్ చేసిన సేవలను నాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ కొనియాడారు. ఈ సందర్బంగా 1963లో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనాల్సిందిగా స్వయంగా ఆర్ఎస్ఎస్‌ను ఆహ్వానించారు. ఆనాటి నుంచి ఈనాటి  వరకు అకుంఠిత దీక్ష దక్షతతో హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ఆర్ఎస్ఎస్ ముందుకు సాగుతోంది.

మనదంతా ఒక జాతి అనేది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం. ఆర్ఎస్ఎస్ హైందవాన్ని ఒక మతంగా కాకుండా ఒక జీవన విధానంగా భావిస్తోంది. హిందూ సంఘటన ద్వారానే హిందూ సమాజాన్ని ఉద్దరించవచ్చనేదే డాక్టర్జీ సిద్ధాంతం. ఆయన స్థాపించిన ఆర్ఎస్ఎస్ శాఖ.. శాఖోప శాఖలుగా విస్తరిస్తూనే ఉంది. డాక్టర్జీ 1921లో ఒకసారి, 1930లో అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్నందకు రెండు సార్లు బ్రిటిష్ వారి చేత జైలు శిక్ష అనుభవించారు.

RSS ప్రాథమికస్థాయి నిర్మాణాన్ని శాఖ అంటారు.  దీని ద్వారా ప్రతి గ్రామంలో ఒక మైదానంలో ప్రతిరోజూ ఒక గంట సమయం ఆ శాఖలోని స్వయంసేవకులంతా సమావేశమవుతారు. అంతేకాదు వ్యాయామాలు, ఒక సమాజ హితమైన చర్చలు ఉంటాయి. ఆర్ఎస్ఎస్ స్థాపన సమయంలో హెడ్గేవార్ను అనుసరించి వారిలో భయ్యాజి దాణె, భావురావ్ దేవరస్, బాలసాహెబ్ దేవరస్, వ్యంకప్ప పాట్కి, అప్పాజీ జోషి ప్రముఖులున్నారు. 1940 జూన్ 9వ తేదిన నాగపూర్ సంఘ శిక్షవర్గ ముగింపు కార్యక్రమమైన దీక్షానంత సమారోప్‌లో డాక్టర్ జీ మాట్లాడుతూ.. హిందూ రాష్ట్ర సూక్ష్మ స్వరూపాన్ని చూడగలుగుతున్నానన్నారు. తాను నమ్మిన సిధ్దాంతాలను తుది శ్వాస వరకు నమ్మడమే కాదు. వాటిని ఆచరణలో చూపించారు. చెల్లా చెదురుగా ఉన్న హిందూ సమాజాన్ని ఏకం చేయడం ద్వారా దేశాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ స్థాపించారు. హెడ్గేవార్ జీ 1940 జూన్ 21న శివైక్యం చెందారు. ఆయన మరణించినా.. ఆయన ఆశయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి అనుబంధ సంస్థలుగా.. విశ్వహిందూ పరిషద్, భజరంగ్ దళ్, సమాచార భారతి, విద్యా భారతి, సేవా భారతి, భారతీయ మజ్జూర్ సంఘ్,  వంటి అనేకం ఉండటం మూలానా.. వీటిని సంఘ్ పరివార్ కింద పరిగణిస్తారు.

ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకోవాలంటే..

కులమత జాతి వర్గ విభేదాలు, వైషమ్యాలు లేకుండా అందరు ఒకేటే భగవద్ ధ్వజం క్రింత దేశ భక్తులను తయారు చేసే సంస్థ. ఈ సంఘశాకలో ప్రతి దినము జరిగే కార్యక్రమాలు.. ధ్వజారోహణము.. ధ్వజ ప్రణామము.. శారీరక వ్యాయామాలు.. సూర్య నమస్కారాలు.. ఆసనములు.. శారీరక దండ ప్రహరణలు.. యోగాసనాలు.. ఆటలు.. క్రీడలు.. ఆటలు.. మన హిందూ సంస్కృతి సంప్రదాయాలను.. భక్తి పూరితమైన కార్యక్రమాలతో పాటు.. పురాణ పురుషుల వీరగాథలు.. గీతాలాపన.. వక్త ప్రసంగాలు.. ఒకరితో మరొకరు సత్సంబంధాలు ఏర్పరుచుకోవడం.. ప్రార్ధన.. ధ్వజావరోహణము ఉంటాయి. పండగలు .. ఇతరత్ర శుభ సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాలుంటాయి.

Also Read: Shobha Karandlaje: ప్రచారంలో అపశ్రుతి.. కేంద్ర మంత్రి కారు తగిలి కార్యకర్త మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News