లాక్‌డౌన్‌లో 19,952 RPF పోస్టులు భర్తీ చేస్తున్నారా!

సోషల్‌ మీడియాలో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (RPF Notification) 19,952 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిందని కథనాలు షేర్‌ అవుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగ నియామకాలు చేపడతారా  అని అనుమనాలు తలెత్తుతున్నాయి.

Last Updated : Apr 14, 2020, 08:41 AM IST
లాక్‌డౌన్‌లో 19,952 RPF పోస్టులు భర్తీ చేస్తున్నారా!

న్యూఢిల్లీ 21 రోజుల లాక్‌డౌన్‌ గడువు నేటితో ముగియనుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టని నేపథ్యంలో లాక్‌డౌన్‌ గడువును కేంద్రం పొడిగించాలని నిర్ణయించింది. అయితే సోషల్‌ మీడియాలో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (RPF) 19,952 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిందని కథనాలు షేర్‌ అవుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగ నియామకాలు చేపడతారా అని కొందరు ఆలోచిస్తుంటే, ఈ సమయంలోనూ నోటిఫికేషన్‌ రావడం సంతోషదాయకమని మరికొందరు నిరుద్యోగులు భావిస్తున్నారు. బంగారం భగభగలు @రూ.45వేలు

ఈ నోటిఫికేషన్‌పై భారతీయ రైల్వే శాఖ ఇదివరకే స్పందించింది. అయితే ఉద్యోగాలంటూ నిరుద్యోగులు వీటికి దరఖాస్తు చేసుకుంటున్న తరుణంలో మరోసారి ఆ శాఖ స్పందించింది. ఏ నోటిఫికేషన్‌ విడుదల చేయలేదని, ప్రస్తుతం వైరల్‌ అవుతున్న జాబ్‌ నోటిఫికేషన్‌ అలర్ట్‌ ఫేక్‌ అని స్పష్టం చేసింది. ఇలాంటి  వాటిని అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకుని నిర్ధారించుకోవాలని సూచించింది. Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

RPF కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ విడుదల చేయలేదని తెలిపింది. ఒకవేళ నోటిఫికేషన్‌ నిజమైతే ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలలో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించి వివరాలు వస్తాయన్నారు. అధికారిక వెబ్‌సైట్‌, Employment Newspaper, న్యూస్‌ మీడియాలో కనిపించిన తర్వాతే నోటిఫికేషన్లను నమ్మాలని రైల్వేశాఖ అధికారులు నిరుద్యోగులకు సూచించారు.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photo

Trending News