అన్నాడీఎంకే అత్యవసర భేటీ.. ఆరుగురికి ఉద్వాసన

ఆర్కేనగర్ బైపోల్ లో ఓడిపోయాక.. అన్నాడీఎంకే పార్టీ అంతర్మథనంలో పడింది. ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్లు అత్యవసరంగా భేటీ అయ్యారు.

Last Updated : Dec 25, 2017, 04:56 PM IST
అన్నాడీఎంకే అత్యవసర భేటీ.. ఆరుగురికి ఉద్వాసన

చెన్నై: ఆర్కేనగర్ బైపోల్ లో ఓడిపోయాక.. అన్నాడీఎంకే పార్టీ అంతర్మథనంలో పడింది. ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్లు అత్యవసరంగా భేటీ అయ్యారు. చర్చ ఎజెండా అంతా ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పరాజయానికి కారణాలు ఏంటో వెతికే పనిలో పడింది. డీఎంకే అభ్యర్థి కంటే ఎక్కువగా ఓట్లు పోలైనా.. దినకరన్ కంటే తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయో విశ్లేషించుకోవాల్సి ఉందని సీనియర్ నేతలు అభిప్రాయం వెల్లడించారు.

కాగా.. అత్యవసర సమావేశం జరుగుతుండగానే అన్నాడీఎంకే పలువురిని పార్టీ పదవుల నుండి తొలగించింది. తొలగించిన జాబితాలో ఎస్.వెట్రివేల్, తంగ తమిళ్ సెల్వన్, రంగస్వామి, ముత్తయ్య, వీపీ కలైరాజన్, సోలింగుర్ పార్తిభన్ ఉన్నారు. వీరు ఆర్కే నగర్ బైపోల్ లో వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణలు రావడంతో ఉద్వాసన పలికారాని స్థానిక మీడియా ఛానళ్లు వెల్లడించాయి. 

Trending News