Republic Day 2022: రిపబ్లిక్ డే సందర్భంగా నక్సల్స్, ఉగ్రవాదులు దాడులట, అక్కడ హైఅలెర్ట్!

Republic Day, Heightens security : నక్సల్స్, ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో హై అలెర్ట్. అప్రమత్తమైన రైల్వేశాఖ. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 08:40 PM IST
  • బిహార్‌‌లో అప్రమత్తమైన ప్రభుత్వం
  • రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం
  • బిహార్ వ్యాప్తంగా ఇప్పటికే హై అలెర్ట్
  • నక్సల్స్, ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు
Republic Day 2022: రిపబ్లిక్ డే సందర్భంగా నక్సల్స్, ఉగ్రవాదులు దాడులట, అక్కడ హైఅలెర్ట్!

Republic Day 2022 : రిపబ్లిక్ డే సందర్భంగా బిహార్‌‌లో గణతంత్ర వేడుకలకు విఘాతం కలిగించేందుకు కొందరు కుట్రపన్నారనే సమాచారంతో బిహార్ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలంటూ బిహార్ హోంశాఖ ఆయా జిల్లాలా ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చింది.
 
బిహార్ వ్యాప్తంగా ఇప్పటికే హై అలెర్ట్ అమల్లోకి వచ్చింది. బిహార్‌‌ లో నక్సల్స్, ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని.. నిఘావర్గాల హెచ్చరికలు జారీ చేయడంతో అన్ని జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ పరిపాలన కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

ఇక నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు కూడా చేశారు. బిహార్‌‌లో అన్ని బస్‌స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, మార్కెట్స్‌, ఇతర రద్దీ ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

మరోవైపు రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా బిహార్ ప్రభుత్వ హెచ్చరికలు జారీ చేయడంతో రైల్వేశాఖ కూడా ఎక్కడిక్కడ అప్రమత్తం చేసింది. ప్రధాన రైల్వే స్టేషన్లలో పార్సెల్ సర్వీస్ బుకింగ్స్ అన్నింటినీ నిలిపి వేసింది. జనవరి 26 (January 26) వరకు అన్ని రైల్వే స్టేషన్స్‌లలో (Railway Stations‌) క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలంటూ సిబ్బందిని ఆదేశించారు రైల్వే అధికారులు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి బిహార్‌‌ వైపు వస్తోన్న వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Also Read : AP Corona Cases Today: ఏపీలో మళ్లీ పెరిగిన కొవిడ్ ఉద్ధృతి.. 15 వేలకు చేరువలో కరోనా కేసులు

రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా నేపాల్, బిహార్ సరిహద్దు వద్ద నిఘాను పెంచారు అధికారులు. నేపాల్ నుంచి వచ్చే అన్ని రోడ్లు దిగ్బంధించారు. ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేశాక అనుమతించనున్నారు. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన బిహార్ పోలీస్ యంత్రాంగం, హోటల్స్, లాడ్జీలు, సత్రాలు, ఇతర పర్యాటక గృహాల్లోని పర్యాటకుల వివరాలన్నింటిని సేకరించే పనిలో ఉన్నారు. ఇక అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేయాలంటూ ప్రజలకు బిహార్ ప్రభుత్వం సూచించింది.

Also Read : SS Thaman on Bheemla Nayak: పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ భీమ్లా నాయక్: తమన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News