Remdesivir: ఆ మందుతో మరణాల రేటు తగ్గుతోందట

కరోనా వైరస్ ( Corona virus ) చికిత్సలో భాగంగా  వివిధ రకాల మందులు అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందిన ఆ మందు కరోనా మరణాల్ని తగ్గిస్తుందనే విషయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆ మందుపై పేటెంట్ కలిగిన గిలియడ్ సైన్సెస్ (Gilead sciences ) ఈ  తాజా విషయాన్ని వెల్లడించింది.

Last Updated : Jul 12, 2020, 01:51 PM IST
Remdesivir: ఆ మందుతో మరణాల రేటు తగ్గుతోందట

కరోనా వైరస్ ( Corona virus ) చికిత్సలో భాగంగా  వివిధ రకాల మందులు అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందిన ఆ మందు కరోనా మరణాల్ని తగ్గిస్తుందనే విషయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆ మందుపై పేటెంట్ కలిగిన గిలియడ్ సైన్సెస్ (Gilead sciences ) ఈ  తాజా విషయాన్ని వెల్లడించింది.

కరోనా చికిత్సలో అందుబాటులో ఉన్న రెమ్‌డెసివిర్ ( Remdesivir ) మందుకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడుతోంది. కొన్ని రకాల యాంటీ వైరల్ డ్రగ్స్ ( Anti viral drugs ) ప్రయోగాల్ని నిలిపివేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation ) ఇటీవల ప్రకటించినా..అందులో రెమ్‌డెసివిర్ మందును ప్రస్తావించలేదు. కరోనాకు చికిత్సలో వేరే ప్రత్యామ్నాయం ఇంకా లేకపోవడంతో రెమ్‌డెసివిర్ మందుకు డిమాండ్ కూడా ఎక్కువైంది. బహుశా అందుకే బ్లాక్ మార్కెట్‌కు కూడా ఈ మందు తరలిపోతోంది. ఇప్పుడు తాజాగా ఈ మందుపై పేటెంట్ ( Remdesivir patent company ) కలిగి గిలియడ్ సైన్సెస్ చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది.ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధిత దేశాల్లో ఆశలు రేపుతోంది. Also read: Remdesivir: ఆకాశాన్నంటుతున్న కరోనా మందు ధర

రెమ్‌డెసివిర్ ( Remdesivir ) మందుతో కరోనా మరణాల్ని తగ్గించే అవకాశాలున్నట్టు తేలిందని గిలియడ్ సైన్సెస్ ( Gilead Sciences ) ప్రకటించింది.తాజాగా 312 మంది రోగుల్నించి సమాచారం సేకరించి విశ్లేషించామని సంస్థ తెలిపింది. అంతేకాకుండా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న 818 మంది రోగులపై రెమ్‌డెసివిర్ మందు ప్రభావం ఎలా ఉందని అధ్యయనం చేశామని స్పష్టం చేసింది. కరోనా వైరస్ తో బాధపడుతున్న రోగులకు 5-10 రోజుల డోసేజ్ విధానంలో మందు అందించి పరిశీలించగా..ఎటువంటి నష్టం కన్పించలేదని గిలియడ్ సైన్సెస్ వివరించింది. Also read: COVID-19 drugs: ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవి విక్రయించరాదు

రెమ్‌డెసివిర్ మందుతో చికిత్స పొందుతున్న రోగుల్లో రికవరీ 74.4 శాతం 14 రోజుల్లో నమోదు కాగా..మరణాలు రేటు అదే 14 రోజుల్లో 7.6 శాతంగా ఉందని నివేదికలో తేలింది. అటు ఈ మందును తీసుకోనివారిలో మాత్రం మరణాల రేటు 12.5 శాతంగా ఉందని సంస్థ చెబుతోంది. ఏప్రిల్ నెలలో అమెరికాలో జరిపిన ట్రయల్స్ లో ప్లేసిబో ఇచ్చిన రోగుల కంటే రెమ్‌డెసివిర్ ప్రయోగించిన రోగులు 31 శాతం వేగంగా కోలుకున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన అనంతరమే దీనిపై పూర్తిగా స్పష్టత వస్తుందని కూడా గిలియడ్ సైన్సెస్ తెలిపింది. Also read: Covid 19: నెలాఖరుకు ఇండియా పరిస్థితి ఏంటి?

రెమ్‌డెసివిర్ మందు జనరిక్ వర్షన్‌ను ప్రస్తుతం ఇండియాలో హెటిరో డ్రగ్స్ ( Hetero Drugs ) , సిప్లా (  Cipla ) , మైలాన్ ( Mylan )  కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు డీసీజీఐ ( DCGI )  అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. ఇప్పుడు గిలియడ్ సైన్సెస్ చేసిన అధ్యయనాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) తో పాటు ఐసీఎంఆర్ ( ICMR ) వంటి కేంద్ర ఆరోగ్య సంస్ధలు ధృవీకరిస్తే రెమ్‌డెసివిర్ మందుకు మరింత ప్రాధాన్యత పెరగనుంది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News