రేపిస్టులను పబ్లిక్‌లో కాల్చి పారేయాలి: బీజేపీ ఎంపీ

అస్సాంలో పెరుగుతున్న అత్యాచార ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Mar 29, 2018, 12:43 PM IST
రేపిస్టులను పబ్లిక్‌లో కాల్చి పారేయాలి: బీజేపీ ఎంపీ

అస్సాంలో పెరుగుతున్న అత్యాచార ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతాపార్టీ తేజ్పూర్ ఎంపీ ఆర్.పి.శర్మ గురువారం రేపిస్టులను పబ్లిక్‌లో కాల్చి పారేయాలి అంటూ వ్యాఖ్యానించారు. మహిళలను అగౌరవపరిచే ప్రజలకు ఇలాంటి శిక్షలే ఉండాలని ఆయన అన్నారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నేరస్థులను ఎన్‌కౌంటర్లలో చంపేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ రేపిస్టుల కోసం షూటింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలని శర్మ అన్నారు. దానివల్ల అటువంటి నేరాలు చేయడానికి ఇతరులు భయపడుతారని ఆయన అన్నారు.

'అత్యాచారాల వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారిని బహిరంగంగా కాల్చి పారేయాలి లేదా ఉరితీయాలి. మహిళలపై ఈ ఘటనలు ఆగాలంటే ఇదే ఏకైక మార్గం' అని శర్మ అన్నారు.
 
ఇటీవలి కాలంలో అస్సాంలో మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా అస్సాం నాగావ్ జిల్లా బోర్డువాలో ఐదుగురు దుండగులు ఐదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి, చంపేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం వంటి నేరాలను శిక్ష పడకుండా వదిలేయకూడదని అన్నారు. మైనర్ రేప్ చేసినప్పుడు అతన్ని జువెనైల్‌గా ఎందుకు పరిగణించాలని ప్రశ్నించారు. రేపిస్టులను పబ్లిక్‌గా షూట్ చేయాలి లేదా ఉరి తీయాలని అన్నారు. ఆ విధమైన శిక్ష అటువంటి నేరాలు చేసేవారికి భయం పుట్టిస్తుందని అన్నారు.

Trending News