చిన్న గాయమే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : డాక్టర్లు

 దక్షిణ భారతదేశ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన అడ్వెంచరస్ షో 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షూటింగ్‌లో పాల్గొన్నసూపర్ స్టార్ అదుపుతప్పి కిందపడటంతో చేతికి గాయమైనట్టు ప్రాథమిక సమాచారం. కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్‌లో ఈ కార్య్రక్రమం జరుగుతుండగా

Last Updated : Jan 28, 2020, 10:10 PM IST
చిన్న గాయమే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : డాక్టర్లు

హైదరాబాద్: దక్షిణ భారతదేశ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన అడ్వెంచరస్ షో 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షూటింగ్‌లో పాల్గొన్నసూపర్ స్టార్ అదుపుతప్పి కిందపడటంతో చేతికి గాయమైనట్టు ప్రాథమిక సమాచారం. కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్‌లో ఈ కార్య్రక్రమం జరుగుతుండగా ప్రమాదం చోటు చేసుకుందని మీడియా వర్గాలు తెలిపాయి. దీంతో షూటింగ్‌ను మధ్యలోనే నిలిపేశారు. 

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్‌తో రజినీకాంత్ సోమవారమే కర్ణాటక బందిపూర్‌కి చేరుకుని షూట్‌లో పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల వరకే కర్ణాటక అటవీ శాఖ అధికారులనుండి షూటింగ్‌కి పర్మిషన్ ఉండగా.. రజినీకాంత్ ఈలోపే గాయాలపాలయ్యారని తెలిపారు. అయితే  సూపర్ స్టార్ రజినీకాంత్ చేతికి మాత్రమే చిన్న గాయమైందని, అభిమానులు ఆందోళలన చెందాల్సిన అవసరం లేదని, రజిని తిరిగి వెంటనే కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు.

Trending News