అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామన్న ముఖ్యమంత్రి

అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామన్న ముఖ్యమంత్రి

Last Updated : Jan 21, 2019, 09:51 AM IST
అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామన్న ముఖ్యమంత్రి

జైపూర్: అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ప్రకటించారు. లోక్ సభతోపాటు వివిధ రాష్ట్రాల్లోని చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎప్పటి నుంచో ఉన్న కోరిక అని చెప్పిన గెహ్లాట్.. రాహుల్ గాంధీ ఆలోచనల ప్రకారమే రాజస్థాన్ అసెంబ్లీలో 33% రిజర్వేషన్ కల్పించేందుకు తాము ఈ ప్రతిపాదన తీసుకురావడానికి సిద్ధమైనట్టు తెలిపారు. అయితే, ప్రస్తుత సమావేశాల్లోనే ఈ ప్రతిపాదనను ప్రవేశపెడతారా లేదా అనే అంశంపై గెహ్లట్ స్పష్టత ఇవ్వలేదు. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పే క్రమంలో అశోక్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలనే దిశగా కాంగ్రెస్ సుదీర్ఘ పోరాటం జరిపిన అనంతరం లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో వాయిదా పడుతూ వస్తోందని, అందుకే కనీసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనైనా శాసన సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు అని అశోక్ గెహ్లట్ అభిప్రాయపడ్డారు.  

Trending News