క్షమాపణలు చెప్పేదే లేదు.. ప్రధాని మోదీనే చెప్పాలి: రాహుల్ గాంధీ

మేక్ ఇన్ ఇండియా.. కాదు రేప్ ఇన్ ఇండియా అని తాను చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌కు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.

Last Updated : Dec 13, 2019, 03:12 PM IST
క్షమాపణలు చెప్పేదే లేదు.. ప్రధాని మోదీనే చెప్పాలి: రాహుల్ గాంధీ

న్యూ ఢిల్లీ: మేక్ ఇన్ ఇండియా.. కాదు రేప్ ఇన్ ఇండియా అని తాను చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌కు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. అంతే కాదు.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనలకు మోదీ క్షమాపణలు చెప్పాలని కోరారు. ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినందుకు దేశ ప్రజలకు ప్రధాని మోదీనే క్షమాపణలు చెప్పాలన్నారు. అంతే కాదు గతంలో ఢిల్లీ.. రేప్ కేపిటల్ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యల క్లిప్‌ను రాహుల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిపైనా ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రాహుల్ గాంధీ.. ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చెలరేగుతున్న నిరసనలను పక్కదారి పట్టించేందుకే తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు.

Trending News