రాహుల్ గాంధీ జాకెట్ ఖరీదు రూ.70 వేలా..?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖరీదైన జాకెట్ ధరించి మేఘాలయలో రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ ఏర్పాటు చేసిన సమావేశానికి రావడం వివాదాస్పదమైంది

Last Updated : Jan 31, 2018, 05:14 PM IST
రాహుల్ గాంధీ జాకెట్ ఖరీదు రూ.70 వేలా..?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖరీదైన జాకెట్ ధరించి మేఘాలయలో రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ ఏర్పాటు చేసిన సమావేశానికి రావడం వివాదాస్పదమైంది. రాహుల్ అంత ఖరీదైన జాకెట్ ధరించి మీటింగ్‌కు రావడాన్ని మేఘాలయ రాష్ట్ర బీజేపీ కమిటీ తప్పు పట్టింది. గతంలో నరేంద్ర మోదీ సైతం ఖరీదైన సూట్ ధరించడాన్ని తప్పుబడుతూ.. రాహుల్ బీజేపీని 'సూట్ బూట్ సర్కార్'  అని విమర్శించిన సంగతి తెలిసిందే.

 బ్లూ డెనిమ్‌ ట్రౌజర్స్‌తో పాటు రూ.70 వేల ఖరీదైన నలుపు రంగు జాకెట్‌తో మీటింగ్‌కు వచ్చిన రాహుల్ గాంధీపై విరుచుకుపడిన బీజేపీ ప్రతినిధులు మాట్లాడుతూ "మీరు అనుకున్నట్లే సూట్‌ బూట్‌ సర్కార్‌ వచ్చాక మేఘాలయలో బ్లాక్ మనీని పెంచిపోషిస్తున్న అవినీతి నాయకులకు అడ్డుకట్ట పడింది.. అయితే కాంగ్రెస్ మాత్రం విమర్శనాత్మకమైన ప్రతిపక్ష పాత్రను పోషించడం మాని తమ అసమర్థతలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుందని’ తెలిపారు.

బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ జాకెట్ ఫోటోని కూడా సోషల్ మీడియాలో పెట్టారు.  మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్న సందర్భంగా రాహుల్ ఇటీవలే ఆ రాష్ట్రాన్ని సందర్శించారు.

Trending News