Kamal Nath వ్యాఖ్యలను ఖండించిన రాహుల్.. క్షమాపణలు చెప్పనన్న మాజీ సీఎం

కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamal Nath) చేసిన ‘ఐటం’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ మ‌హిళా నాయ‌కురాలు, దాబ్రా బీజేపీ అభ్యర్థిని ఇమార్తి దేవి (Imarti Devi) ని ఐటం అని సంభోదించడంపై బీజేపీ నాయకులు కమల్ నాథ్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Last Updated : Oct 20, 2020, 05:33 PM IST
Kamal Nath వ్యాఖ్యలను ఖండించిన రాహుల్.. క్షమాపణలు చెప్పనన్న మాజీ సీఎం

Rahul Gandhi calls Kamal Nath's 'item' remark ‘inappropriate: న్యూఢిల్లీ: కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్ (Kamal Nath) చేసిన ‘ఐటం’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ మ‌హిళా నాయ‌కురాలు, దాబ్రా బీజేపీ అభ్యర్థిని ఇమార్తి దేవి (Imarti Devi) ని ఐటం అని సంభోదించడంపై బీజేపీ నాయకులు కమల్ నాథ్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ వివాదంపై కమల్‌నాథ్ (Ex CM Kamal Nath) సైతం వివరణ ఇచ్చుకున్నారు. తనకు ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి పేరు గుర్తుకురాలేదని.. అందుకే తాను ఐటం నెంబర్ వన్, టూ అని సంభోదించినట్లు చెప్పారు. ఈ క్రమంలో మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi ) స్పందించారు. కమల్‌నాథ్‌ మా పార్టీ వ్యక్తే అయినా.. ఆయన వాడిన పదజాలాన్ని తాను సహించనని రాహుల్ స్పష్టంచేశారు. అలాంటి వ్యాఖ్యలను ప్రశంసించలేమనిటూ ఆయన కమల్ నాథ్ వ్యాఖ్యలను రాహుల్ తప్పుబట్టారు. ఎదిఏమైనప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమంటూ రాహుల్ గాంధీ వయనాడ్ పర్యటనలో మీడియాతో పేర్కొన్నారు. 

ఈ నేప‌థ్యంలో తాజాగా రాహుల్ గాంధీ చేసిన విమ‌ర్శ‌పై మీడియా ప్ర‌తినిధులు క‌మ‌ల్‌నాథ్ స్పంద‌న కోర‌గా.. అది రాహుల్‌ గాంధీ అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. తాను ఏ సంద‌ర్భంలో అలాంటి ప‌దం ఉప‌యోగించాల్సి వ‌చ్చిందో ఇప్ప‌టికే వివ‌ర‌ణ ఇచ్చాన‌ని ఆయన తెలిపారు. ఇమార్తి దేవికి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌బోతున్నారా అంటూ.. విలేక‌రులు ప్ర‌శ్న‌ించగా.. ఈ విష‌యంలో తాను ఎందుకు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, ఉద్దేశపూర్వ‌కంగా అవ‌మానించ‌న‌ప్పుడు ఎవ‌రినీ క్ష‌మాప‌ణ కోరాల్సిన అవసరం లేదన్నారు.  Also read: Kamal Nath Item Comments: అందుకే ఆమెను ఐటం అన్నాను: కమల్‌నాథ్

అయితే.. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రాజే కోసం దాబ్రాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాజీ సీఎం ప్రసంగిస్తూ.. ఇమార్తి దేవిపై ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే బీజేపీ శ్రేణులు కమల్ నాథ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. Also read: NEET 2020 Results: ‘నీట్‌’గా లేదు.. ఆలిండియా టాపర్‌ సైతం ఫెయిల్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News