Death Threat to CM Amarinder Singh | మొహాలి: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ (CM Amarinder Singh) ను చంపుతామని బెదిరిస్తూ అంటించిన పోస్టర్‌కు సంబంధించి పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి (Amarinder Singh) ని చంపితే రూ.10 లక్షల డాలర్లు ఇస్తామంటూ గుర్తుతెలియన వ్యక్తులు అంటించిన పోస్టర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
మొహాలి (Mohali) లోని సెక్టార్ 66,67 క్రాసింగ్ ప్రాంతంలో ఈ పోస్టర్‌ను అతికించినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్టర్‌పై ఒక ఈమెయిల్ అడ్రస్ కూడా ఉందని పేర్కొన్నారు. అయితే ఈ పోస్టర్ గురువారం (డిసెంబర్ 31) మొహాలిలో కనిపించింది. ఈ మేరకు పోలీసులు (Punjab Police) ఐపీసీ 504, 506, 120 బి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Also Read: Akhilesh Yadav: వారి వ్యాక్సిన్‌ను నమ్మను.. తీసుకోను
మొహాలిలోని సెక్టార్ 66,67 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించడానికి పంజాబ్ (Punjab) పోలీసులు నిరాకరించారు. Also Read: Sourav Ganguly Health Updates: గంగూలీకి పూర్తయిన యాంజియోప్లాస్టీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook