Punjab cuts petrol Price: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై చర్చ సాగుతున్న నేపథ్యంలో (Petrol price in India) పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో పెట్రోల్ ధరను రూ.10, డీజిల్ ధరను రూ.5 తగ్గిస్తున్నట్లు (Punjab cut Fuel prices) పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ ప్రకటించారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఈ స్థాయిలో తగ్గించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఇదొక్కటే కావడం గమనార్హం. తగ్గించిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.
We have decided to decrease petrol and diesel prices by Rs 10 per litre and Rs 5 per litre, respectively, to be effective from midnight today: Punjab CM Charanjit Singh Channi pic.twitter.com/Q3PP1scPeo
— ANI (@ANI) November 7, 2021
కేంద్రం దీపావళి కానుక..
దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు దీపావళి కానుకగా.. ఎక్సైజ్ సుంకాలు (పెట్రోల్‌పై రూ.5 డీజీల్ పై రూ.10) తగ్గించి కేంద్రం ఊరటనిచ్చింది.
రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాయి. ఇందులో ఎక్కువ రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్నవే కావడం గమనార్హం.
Also read: Telangana: ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము.. మూడు నెలల చిన్నారి మృతి..
70 ఏళ్లలో ఇదే తొలిసారి..
ఇది జరిగిన దాదాపు మూడు రోజుల తర్వాత పంజాబ్ ప్రభుత్వం భారీగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గత 70 ఏళ్లలో ధరలు ఈ స్థాయిలో తగ్గించడం ఇదే ప్రథమమని వెల్లడించారు ముఖ్యమంత్రి చన్నీ. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే.. తమ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గువగా ఉన్నట్లు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీతో పోలిస్తే.. రూ.9 చౌకకే పెట్రోల్ లభిస్తున్నట్లు వివరించరారు.
మరికొద్ది నెలల్లో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Also read: Afghan vs Kiwis: ఆఫ్ఘన్-కివీస్ మ్యాచ్‌పైనే టీమ్ ఇండియా ఆశలు, లేదా ఇంటికే
Also read: Anushka Shetty New Movie: అనుష్క బర్త్డే సర్ ప్రైజ్.. యూవీ క్రియేషన్స్ తో కొత్త సినిమా ప్రకటన
తెలుగు రాష్ట్రాల్లో తగ్గని వ్యాట్..
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు కేంద్రం పిలుపు మేరుకు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కేంద్రం ఇచ్చిన మినహాయింపు తప్పా.. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి ఉపశమనం కల్పించలేదు. రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read: Operation Parivartan: గంజాయికి చెక్, ఆపరేషన్ పరివర్తన్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook