Public Holiday: దేశవ్యాప్తంగా బ్యాంకులకు ప్రతి నెలా సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తుంటుంది. ఇందులో రెండు, నాలుగు శనివారాలతో పాటు నాలుగు ఆదివారాలుంటాయి. ఇవి కాకుండా కొన్ని ప్రాంతీయ, కొన్ని జాతీయ సెలవులుంటాయి. ఎప్పుడెప్పుడు ఏ రాష్ట్రంలో సెలవులో ముందే చూసుకోవడం మంచిది.
దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా ఇతర చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన కాలుష్యంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అన్ని స్కూళ్లకు 12వ తరగతి వరకూ సెలవులిచ్చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇవాళ్టి వరకూ సెలవులుంటే మరి కొన్ని ప్రాంతాల్లో నిరవధిక సెలవులున్నాయి. ఇక వచ్చే నెల డిసెంబరులో దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులకు సైతం సెలవు ఉంది. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, స్కూల్స్, కళాశాలలు, ప్రభుత్వ ఆఫీసులు మూతపడనున్నాయి. . అంటే డిసెంబర్ 25 వతేదీన దేశవ్యాప్తంగా అన్నీ క్లోజ్ కానున్నాయి.
ఇక ఈ నెలలో రేపు అంటే నవంబర్ 24వ తేదీ మార్టిర్‌డోమ్ డే. ఈ రోజున మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సిక్కుల 9వ గురువు తేజ్ బహదూర్‌ను ఇస్లాం స్వీకరించలేదనే కారణంతో ఉరి వేశారని అంటారు. ఈ రోజున మార్టిమ్‌డోమ్ డేగా జరుపుకుంటారు. మరణానికి ముందు తేజ్ బహదూర్ మొఘల్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాడు. 1675 నవంబర్ 24 తేజ్ బహదూర్‌కు ఉరి వేసిన రోజు. అందుకే రేపు పంజాబ్‌లో బ్యాంకులు, స్కూళ్లు, కళాశాలలకు సెలవుంది.
Also read: Bank Locker Rules: బ్యాంకు లాకర్లలో ఈ వస్తువులు ఉంచడం నిషిద్ధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.