మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ప్రొజెక్టర్ల హడావుడి ప్రారంభమైంది. జనాలు ఎన్నికల ఫలితాలను వీక్షించడానికి ప్రొజెక్టర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రజలు.. పోలో గ్రౌండ్‌కు ఇప్పటికే వేలాది సంఖ్యలో తరలివచ్చారు.ఈసారి ఇక్కడ బీజేపీ (భారతీయ జనతా పార్టీ) పాగా వేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మేఘాలయలో కాంగ్రెస్ 59 స్థానాల్లో, బీజేపీ 47 స్థానాల్లో పోటీ చేసింది.
#WATCH: Huge crowd at Shillong Polo ground where people can see counting trends through a projector #MeghalayaElection2018 pic.twitter.com/iBHVpy2pvl
— ANI (@ANI) March 3, 2018