ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం.. ప్రధానాంశాలు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను అభినందించిన రాష్ట్రపతి.. 17వ లోక్‌సభకు ఎన్నికైన వారిలో సగం మంది తొలిసారి ఎన్నికైన వారేనని అన్నారు. పురుషులతో సమానంగా మహిళా సభ్యులుండటం అభినందించదగిన విషయం అని రాష్ట్రపతి మహిళా సభ్యులను అభినందించారు. ఆర్థికాభివృద్ధి, మహిళా సాధికారత, ఉగ్రవాదంపై పోరు వంటి అంశాలు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. 

Last Updated : Jun 20, 2019, 09:09 PM IST
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం.. ప్రధానాంశాలు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను అభినందించిన రాష్ట్రపతి.. 17వ లోక్‌సభకు ఎన్నికైన వారిలో సగం మంది తొలిసారి ఎన్నికైన వారేనని అన్నారు. పురుషులతో సమానంగా మహిళా సభ్యులుండటం అభినందించదగిన విషయం అని రాష్ట్రపతి మహిళా సభ్యులను అభినందించారు. ఆర్థికాభివృద్ధి, మహిళా సాధికారత, ఉగ్రవాదంపై పోరు వంటి అంశాలు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. 

2014 తర్వాత మరోసారి ప్రజలు ఎన్నికల్లో చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెబుతూ 2014కు ముందు నాటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటకు తీసుకురావాలని జనం భావించడం వల్లే అది సాధ్యపడిందని అన్నారు. సబ్‌కా సాథ్‌-సబ్‌కా వికాస్‌ అనేది మా ప్రభుత్వ నినాదం అని స్పష్టంచేసిన రాష్ట్రపతి.. శక్తివంతమైన భారతదేశం నిర్మాణం కోసం కృషి చేస్తూనే ఉంటామని తెలిపారు. రైతుల ఆత్మ గౌరవం పెంచడం కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని సభకు వెల్లడించిన ఆయన.. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా పెట్టుబడి సాయం అందజేయడం, 60 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్‌ అందించాలనుకోవడం వంటివి అందులో భాగమేనని తెలిపారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల పక్కా ఇళ్లు, 2022 నాటికి లక్షన్నర హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేయనుండటంతోపాటు ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఇప్పటికే 26 కోట్ల మందికి చికిత్స సహాయానికి కృషిచేసినట్టు వెల్లడించారు. చంద్రయాన్‌-2కి సర్వం సిద్ధమైనట్టు ప్రకటించి దేశం సాంకేతిక రంగంలోనూ దూసుకుపోతోందని అన్నారు.

Trending News