Sudharmurthy: విద్యావేత్త సుధామూర్తికి మహిళా దినోత్సవ 'కానుక'.. రాజ్యసభకు నామినేట్‌

Rajya Sabha: మహిళ దినోత్సవం వేళ ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తికి భారత ప్రభుత్వం కానుక అందించింది. ఆమెను రాజ్యసభకు ఎంపిక చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 8, 2024, 04:36 PM IST
Sudharmurthy: విద్యావేత్త సుధామూర్తికి మహిళా దినోత్సవ 'కానుక'.. రాజ్యసభకు నామినేట్‌

Womens Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తిని భారత ప్రభుత్వం రాజ్యసభకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్‌ చేశారని 'ఎక్స్‌'లో తెలిపారు. ఈ సందర్భంగా సుధామూర్తికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభకు ఎంపిక చేయడంతో అందరూ సుధామూర్తికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

Also Read: D Raja: భారత్‌ ఒక దేశమే కాదు.. తమిళనాడు ఒక దేశం: ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు

'సామాజిక సేవ, దాతృత్వం, విద్యతోపాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారం, స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభకు నామినేట్‌ అవడం నారీశక్తికి బలమైన నిదర్శనం. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడానికి చక్కటి ఉదాహరణ. ఆమ ఎంపీ పదవీకాలం విజయవంతం అవ్వాలి' అని మోదీ పోస్టు చేశారు. 

Also Read: River Metro: దేశంలోనే తొలిసారిగా జలమార్గంలో మెట్రో రైలు.. నదిలో రైలు విశేషాలు ఇలా

తనను రాజ్యసభకు నామినేట్‌ కావడంపై థాయ్‌ల్యాండ్‌లో ఉన్న సుధామూర్తి స్పందించారు. ఓ ప్రధాన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. 'మహిళా దినోత్సవం రోజున రాజ్యసభకు నామినేట్‌ చేశారనే ప్రకటన రావడం డబుల్‌ సర్‌ప్రైజ్‌. చాలా ఆనందంగా ఉంది. ప్రధానికి కృతజ్ఞతలు చెబుతున్నా. వాస్తవానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఏనాడూ పదవులు కోరలేదు. ప్రభుత్వం నన్ను ఎందుకు ఎంపిక చేసిందో తెలియదు. దేశానికి సేవ చేసేందుకు ఇది కొత్త బాధ్యతగా భావిస్తున్నా' అని ఆమె తెలిపారు.

సుధామూర్తి నేపథ్యం
రాజ్యసభకు ఎంపికైన సుధామూర్తి రచయిత్రిగా, విద్యావేత్తగా రాణిస్తున్నారు. కర్ణాటకలోని షిగ్గామ్‌ ప్రాంతంలో జన్మించిన సుధామూర్తి ప్రస్తుత వయసు 73 ఏళ్లు. ఇంజనీరింగ్‌ చదివిన ఆమె కంప్యూటర్‌ సైంటిస్ట్‌గా రాణించారు. గ్రామీణాభివృద్ధికి, విద్యా వ్యాప్తికి ఆమె కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్‌, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్‌ పురస్కారాలను ప్రకటించింది. నారాయణమూర్తి, సుధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కుమార్తె భర్త రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News