Jharkhand Political Crisis: జార్ఖండ్‌లో మహా డ్రామా కొనసాగుతోంది. ఎమ్మెల్యే పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా అనంతరం గవర్నర్ రమేష్ బైస్‌తో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈసమావేశంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరే అవకాశం ఉంది. ఇందులోభాగంగానే కాసేపట్లో సంకీర్ణ ప్రభుత్వ ముఖ్య నేతలు సమావేశంకానున్నారు. తాజాగా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. భేటీ అనంతరం గవర్నర్‌ను కలిసే అవకాశం కనిపిస్తోంది.
సంకీర్ణ ప్రభుత్వం కూలే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ సంకీర్ణంలోని 34 మంది ఎమ్మెల్యేలకు ఇటీవల ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు కొనుగోలు చేస్తారని ముందే భావించిన సీఎం సోరెన్ వారిని రిసార్ట్‌కు తరలించారు. రాష్ట్రంలో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ..ముందుకు సాగుతున్నారు. కాసేపట్లో సంకీర్ణ ప్రభుత్వ నేతల సమావేశం జరగనుంది. దీంతో ఎమ్మెల్యేలంతా ఛత్తీస్‌గఢ్ నుంచి రాంచీకి చేరుకున్నారు.
ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కేసులో హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. సీఎంగా ఉంటూ సొంతంగా గనులు కేటాయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలోనే ఆయనపై ఈసీకి, గవర్నర్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఈసీ అధికారులు..తన నిర్ణయాన్ని గవర్నర్ రమేష్ బైస్‌కు పంపారు. గవర్నర్ నిర్ణయంపై గత ఐదురోజులుగా ఉత్కంఠ నెలకొంది. సోరెన్‌పై అనర్హత వేటు పడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో సంకీర్ణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సీఎం హేమంత్ సోరెన్‌పై వేటు పడితే ప్రభుత్వ కూలకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఈనేపథ్యంలోనే రిసార్ట్‌కు ఎమ్మెల్యేలను తరలించారు. మొత్తంగా జార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది సభ్యులు ఉన్నారు. యూపీఏకి 49 ఎమ్మెల్యేలు ఉండగా..బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐతే ఇటీవల దేశవ్యాప్తంగా విపక్షాల ప్రభుత్వాలు కూలుతున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి. దీంతో జార్ఖండ్‌లో ఏం జరగబోతోందన్న ఆసక్తి నెలకొంది. జార్ఖండ్‌లో మహారాష్ట్ర ఎపిసోడ్ రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడి పరిణామాలను బీజేపీ అధిష్ఠానం నిశితంగా పరిశీలిస్తోంది. అవకాశాన్ని బట్టి సీనియర్ నేతలను రంగంలోకి దిపే అవకాశం ఉంది.
Also read:K.Laxman: ఎన్డీఏలోకి టీడీపీ చేరబోతోందా..? బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ ఏమన్నారంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి