Viral Video: మైనర్ బాలికను వేధించిన పోలీస్‌ వీడియో వైరల్‌.. తగిన బుద్ది చెప్పిన మహిళ

రక్షణ కలిపించాల్సిన పోలీసులే వేధిస్తే.. నేరాలను కట్టడి చేయాల్సిన వాళ్లే నేరస్థుల్లా మారితే.. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రక్షించాల్సిన కానిస్టేబుల్.. స్కూలు అమ్మాయిలను వేధిస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఆ వివరాలు 

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2023, 01:00 PM IST
Viral Video: మైనర్ బాలికను వేధించిన పోలీస్‌ వీడియో వైరల్‌.. తగిన బుద్ది చెప్పిన మహిళ

Police Harassing School Girl: అర్థరాత్రి కూడా ఆడవారు డ్యూటీ చేస్తూ రోడ్డు మీద ధైర్యంగా తిరుగుతున్నారు అంటే అది పోలీసులు ఇచ్చే భరోసానే... దొంగతనాలు... హత్యలు జరగకుండా చూసుకోవడంలో పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. పోలీసులు ఉన్నారు అనే భరోసా వల్లే ఎంతో మంది సామాన్యులు ప్రశాంతంగా ఉంటున్నారు. అలాంటి పోలీసులే నేరాలకు పాల్పడితే.. ఆడవారికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోలీసు వారే ఆడవారిపై లైంగిక వేదింపులకు పాల్పడితే ఏం చేయాలి... అదే సంఘటన ఉత్తర ప్రదేశ్‌ లో జరిగింది. 

సాధారణంగానే ఉత్తర ప్రదేశ్ లో నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి... మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. అలాంటి చోట పోలీసులు అదనంగా శ్రద్ద పెట్టి డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఒక కీచక పోలీసులు మైనర్‌ బాలికను వేదించిన వీడియో వైరల్‌ అయ్యింది. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లక్నో లో ఒక స్కూల్‌ కు వెళ్లే బాలికను వెంబడిస్తూ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కనిపించాడు. దాంతో వెంటనే అటుగా వెళ్తున్న వారు వీడియో తీశారు. ముస్లీం సామాజిక వర్గానికి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ మహ్మద్ షహదత్ అలీ హిందూ బాలిక ను ప్రతి రోజు వెంబడించడంతో పాటు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడట. 

వీడియోను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడంతో ఉన్నతాధికారుల వరకు ఈ విషయం వెళ్లింది. వెంటనే అతడిని సస్పెండ్‌ చేస్తున్నట్లుగా లక్నో డీసీపీ అపర్ణ కౌశిక్ ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఆ హెడ్‌ కానిస్టేబుల్‌ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు. బాలికను వేధింపుల కేసులో ఇప్పటికే అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. 

Also Read: Bhola Shankar New Schedule : కోల్‌కతాలో భోళా శంకర్.. సెట్‌లో చిరు.. పిక్స్ వైరల్

పోకిరిల ఆట కట్టించాల్సిన సీనియర్ పోలీసు ఇలా మైనర్ బాలికను అది కూడా స్కూల్‌ కు వెళ్తున్న సమయంలో వేదించడం పై తీవ్రంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళ సంఘాల వారు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. 

రోడ్డు పై పోలీసు యూనిఫామ్‌ లో తిరుగుతూ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారందరికి కూడా బుద్ది వచ్చేలా మహ్మద్ షహదత్ అలీ కి శిక్ష పడాల్సిందే అంటూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. మైనర్ బాలికను వెంబడిస్తూ వేదించిన పోలీస్ హెడ్‌ కానిస్టేబుల్‌ తీరుపై యూపీ పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు. పోలీసులే ఇలా వ్యవహరిస్తే సామాన్యులు ఎలా రక్షణ కోసం పోలీస్‌ స్టేషన్ కి వస్తారంటూ రాజకీయ వర్గాల వారు కూడా ప్రశ్నిస్తున్నారు.

Also Read: Adhire Abhi : అందుకే జబర్దస్త్ షోలో ఎక్కువ ఇస్తారు.. చైతన్య మాస్టర్ చివరి వీడియోపై అదిరే అభి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News