PM Modi's Brother Prahlad Joshi: కేంద్రంపైనే ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ జోషి ధర్నా

PM Modi's Brother Prahlad Joshi Protest: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ జోషి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్‌కి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ప్రహ్లాద్ జోషి ప్రధాని మోదీకి స్వయానా సోదరుడు.

Written by - Pavan | Last Updated : Aug 2, 2022, 07:27 PM IST
  • కేంద్రానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా
  • రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసమే ఆందోళన
  • త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్న మోదీ సోదరుడు
PM Modi's Brother Prahlad Joshi: కేంద్రంపైనే ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ జోషి ధర్నా

PM Modi's Brother Prahlad Joshi Protest: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ జోషి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్‌కి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ప్రహ్లాద్ జోషి ప్రధాని మోదీకి స్వయానా సోదరుడు. అహ్మెదాబాద్‌లో జాతీయ ఆహార పథకంలో భాగంగా నిర్వహించే రేషన్ షాప్ డీలర్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే రేషన్ డీలర్ల తరపున సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ఢిల్లీలో ధర్నాలో పాల్గొన్న ప్రహ్లద్ జోషి ఇవాళ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. 

ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, రెట్టింపవుతున్న ఖర్చులతో రేషన్ షాపుల నిర్వహణ భారంగా మారిందని ప్రహ్లద్ జోషి ఆవేదన వ్యక్తంచేశారు. ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కిలోకు 20 పైసలు మార్జిన్ పెంచుతున్నట్టు ప్రకటించడం దారుణం అని మండిపడ్డారు. కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి బతుకే భారంగా మారిన రేషన్ డీలర్ల సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా ప్రహ్లాద్ జోషి కోరారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమ సమస్యల పరిష్కారించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామని ప్రహ్లాద్ జోషి తెలిపారు. బుధవారం మరోమారు భేటీ కానున్న ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్.. తమ సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి వైఖరి అవలంభిస్తే బాగుంటుందనే విషయం చర్చించి ఆ తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రహ్లాద్ జోషి స్పష్టంచేశారు. 

ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వంభర్ బసు పీటీఐతో మాట్లాడుతూ.. బుధవారం తామంతా లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను సైతం కలిసి తమ సమస్యలు వివరిస్తామని అన్నారు.

Also Read : Rare Seen : ఇది కలయా.. నిజమా! ఒకే వేదికపైకి జగన్, కేసీఆర్, చంద్రబాబు..

Also Read : Monkeypox Cases: దేశంలో పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. కేరళలో మరో కొత్త కేసు నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News