New Parliament Schedule: 1927 నుంచి చట్టాల తయారీలో 1947 నుంచి స్వదేశీ పాలనలో నిమగ్నమై రాజసం ఒలికిస్తూ ఠీవిగా నిలబడిన పాత పార్లమెంట్ ఇవాళ్టితో ముగబోనుంది. ఆధునిక పరిజ్ఞానం, వసతులతో రెట్టింపు సామర్ధ్యంతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం ఇవాళ ప్రారంభం కానుంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ షెడ్యూల్ వివరాలు మీ కోసం..
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న భారతదేశ కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం మరి కాస్సేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా జరగనుంది. ముందుగా ఉదయం 7.30 గంటలకు పార్లమెంట్ భవన ప్రాంగణంలో పూజాది కార్యక్రమాలుంటాయి. ఇందులో ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనకర్ పాల్గొననున్నారు. ఆ తరువాత 8.35 గంటలకు కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ ఛాంబర్‌లో మోదీ అడుగుపెట్టనున్నారు.
సెంగోల్ స్థాపన, సెంగోల్ అంటే ఏమిటి
లోక్‌సభ ఛాంబర్‌లో ఉదయం 8.35 గంటల నుంచి 9 గంటల వరకూ అధికార మార్పిడికి చిహ్నంగా భావించే సెంగోల్ స్థాపన ఉంటుంది. కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ స్పీకర్ సీటు పక్కనే ప్రత్యేక అద్దాల బాక్స్‌లో సెంగోల్ స్థాపన చేయనున్నారు మోదీ. ప్రత్యేక మంగళ వాయిద్యాలు, తమిళనాడు దేవాలయ గాయక కళాకారులతో కోలారు పడిగం కీర్తనలతో సెంగోల్ స్థాపన ఉంటుంది.
1947లో ఆంగ్లేయుల నుంచి అధికార మార్పిడికి చిహ్నంగా నాటి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేసిన సెంగోల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అధికార మార్పిడికి చిహ్మంగా లార్డ్ మౌంట్ బాటెన్ సెంగోల్ అలియాస్ రాజదండంను నెహ్రకు ఇచ్చినట్టుగా సమాచారం. సెంగోల్‌ను 5 అడుగుల ఎత్తుతో బంగారు రేకు తాపడంతో తయారు చేయించారు. అధికార మార్పిడి లేదా రాజ్యాభిషేకం సందర్భంగా రాజదండం అందించే సంప్రదాయాన్ని చోళ రాజులు, దక్షిణాదిరాజులు పాటించారు.
ఇక ఉదయం 9.30 గంటలకు నిర్వహించే ప్రార్ధనా సమావేశంలో శంకరాచార్యులు, విద్యావేత్తలు, వేద పండితులు, సాధువులు పాల్గొననున్నారు. మద్యాహ్నం 12 గంటలకు జాతీయ గీతాలాపనతో సెకండ్ సెషన్ ప్రారంభమౌతుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనకర్ స్వాగతోపన్యాసం ఇస్తారు. ఈ సమయంలో రెండు షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన ఉంటుంది. అనంతరం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పంపించిన సందేహాలు విన్పిస్తారు.
మద్యాహ్నం 12.38 గంటలకు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రసంగం షెడ్యూల్ అయి ఉంది. ఆ తరువాత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా మద్యాహ్నం 1.05 గంటలకు 75 రూపాయల నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల కానున్నాయి. మద్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది.
Also read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook