మిషన్ శక్తి ఆపరేషన్: భారత్ సాధించిన సంచలన విజయాన్ని వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ

భారత్ సాధించిన సంచలన విజయాన్ని వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ

Last Updated : Mar 28, 2019, 09:23 AM IST
మిషన్ శక్తి ఆపరేషన్: భారత్ సాధించిన సంచలన విజయాన్ని వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ అద్భుత విజయాన్ని సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం ఉదయం11:45 నుంచి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తాను ఓ ముఖ్యమైన సందేశాన్ని వెల్లడిస్తానని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కొద్దిసేపటి క్రితమే మిషన్ శక్తి ఆపరేషన్‌లో భాగంగా భూమికి సమీప కక్షలోని ఓ లైవ్ శాటిలైట్‌ని భారత్ ద్వంసం చేసిందని స్పష్టంచేశారు. భారత్ ప్రయోగించిన మిస్సైల్ కేవలం మూడు నిమిషాల్లోనే ఆపరేషన్‌ను పూర్తిచేసిందని మోదీ తెలిపారు. అంతర్జాతీయ చట్టాలకు కానీ లేదా ఏదైనా ఇతర ప్రపంచదేశాలకు కానీ మిషన్ శక్తి ఆపరేషన్ విరుద్దం కాబోదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. 

ఈ విజయంతో ఇప్పటివరకు ఈ ఘనతను సొంతం చేసుకున్న అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రదేశాల సరసన భారత్ నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా ప్రకటించారు. అంతరిక్షంలోని ఉపగ్రహాలను సైతం కూల్చేసే శక్తిసామర్ధ్యాలు కలిగిన మిస్సైల్స్ ఇప్పుడు భారత్ సొంతం అని ప్రధాని మోదీ అన్నారు.

Trending News