న్యూఢిల్లీ: డిసెంబర్ 31, ఆదివారం నాటి 'మన్ కీ బాత్' కి ఒక ప్రత్యేకత ఉంది. ఇదే 2017 ఏడాదికిగానూ చివరి 'మన్ కీ బాత్'. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ చివరి ప్రసంగంలో ప్రసంగించనున్నారు.
ఈ 39వ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం ఎడిషన్ ప్రధాన మంత్రి కార్యాలయం, సమాచార, బ్రాడ్కాస్టింగ్ మరియు డీడీ న్యూస్ యొక్క యూట్యూబ్ ఛానెళ్లలో ప్రసారం చేయబడుతుంది. ఈ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో (AIR), దూరదర్శన్, నరేంద్రమోదీ మొబైల్ అప్లికేషన్లలలో ప్రసారమవుతుంది. 1922కి మిస్డ్ కాల్ ఇచ్చి, మీ మొబైల్ ఫోన్ లో ఈ కార్యక్రమాన్ని వినవచ్చు.
తన మునుపటి 'మన్ కీ బాత్' లో, ప్రధాని ఉగ్రవాదం ప్రపంచ ముప్పును ఎలా ఎదుర్కోవచ్చని చెప్పారు. యూరియా వాడకాన్ని తగ్గించాలని రైతులను కోరారు.
Do tune in at 11 AM tomorrow. #MannKiBaat pic.twitter.com/LlwrZPQDxo
— Narendra Modi (@narendramodi) December 30, 2017
ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో, డీడీ నేషనల్ మరియు డీడీ న్యూస్లో ప్రసారమవుతుంది. ప్రధాని మోదీ రేడియో కార్యక్రమాన్ని 2017 ట్విట్టర్లో న్యూస్ & గవర్నెన్స్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాష్ టాగ్ గా ప్రకటించారు.
డిసెంబర్ 31న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేరళలోని శివగిరి మట్ వద్ద 85వ శివగిరి తీర్థయాత్ర వేడుకల కోసం ప్రధాని ప్రసంగిస్తారు. జనవరి 1 సోమవారం కోల్కతాలో ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ 125వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు.