మోదీ ప్రశంసించిన ఈ బామ్మ ఎవరో తెలుసా..?

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మన్  కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో మాట్లాడారు. ప్రతి నెలా చివరి ఆదివారం రోజున ఆయన మన్ కీ బాత్  ద్వారా దేశ ప్రజలతో అనేక విషయాలు పంచుకుంటారు. ఈ రోజు కూడా అలాగే పలు అంశాలను ప్రజలకు చెప్పారు. ఇందులో భాగంగా 105 ఏళ్ల బామ్మను ఆయన ప్రశంసించారు.

Last Updated : Feb 23, 2020, 12:15 PM IST
మోదీ ప్రశంసించిన ఈ బామ్మ ఎవరో తెలుసా..?

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మన్  కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో మాట్లాడారు. ప్రతి నెలా చివరి ఆదివారం రోజున ఆయన మన్ కీ బాత్  ద్వారా దేశ ప్రజలతో అనేక విషయాలు పంచుకుంటారు. ఈ రోజు కూడా అలాగే పలు అంశాలను ప్రజలకు చెప్పారు. ఇందులో భాగంగా 105 ఏళ్ల బామ్మను ఆయన ప్రశంసించారు.  ఇంతకీ ఆ బామ్మ ఎవరో తెలుసా..? 

కేరళ కొల్లం జిల్లాకు చెందిన ఆ బామ్మ పేరు. .  భాగీరథి అమ్మ. పేరుకు తగ్గట్టే ఆమె భగీరథ ప్రయత్నమే చేసింది.  105 ఏళ్లు ఉన్నా. .  యువతకు ఏ మాత్రం తాను తీసిపోనని చాటి చెప్పింది. ఆమెకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చదువు మానేసింది. ఆ రోజుల్లో.. ఆడపిల్లలు చదువుకునేందుకు అనేక ఆంక్షలు ఉండేవి. కానీ ఆనాటి నుంచి చదువుకోవాలనే పట్టుదలను .. జీవిత చరమాంకం వరకు అలాగే ఉంచుకుంది బామ్మ.  ఇప్పుడు 105 ఏళ్ల వృద్ధాప్యంలో 4వ తరగతి పాస్ అయింది. అదీ 75 శాతం మార్కులతో .. పాస్ కావడం విశేషం. 

ఆ నోటా.. ఈ నోటా. . ఈ ముచ్చట ప్రధాని నరేంద్ర మోదీకి తెలిసింది. దీంతో ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ లో ఆయన బామ్మను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆమె నుంచి దేశ ప్రజలు, ముఖ్యంగా యువత ప్రేరణ పొందాలని కోరారు. శతాధిక వృద్ధురాలు తన పట్టుదల కోసం అంతగా కష్టపడితే .. యువత ఏ రకంగా కష్టపడవచ్చో మనం అర్ధం చేసుకోవచ్చని ప్రధాని మోదీ అన్నారు. 

Read Also: ఆ డ్రెస్.. అందానికి కేరాఫ్ అడ్రస్..

Trending News