సైబర్ స్పేస్ అంశంపై 5వ అంతర్జాతీయ సదస్సును న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సదస్సు రెండు రోజులపాటు జరుగనుంది. 'సైబర్ ఫర్ ఆల్: ఏ సెక్యూర్ అండ్ ఇన్క్లూసివ్ సైబర్ స్పేస్ ఫర్ సస్టేనబుల్ డెవలప్మెంట్' నినాదంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. భారతదేశం మొదటిసారి ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- "డిజిటల్ సాంకేతికతతో సేవలు మెరుగవ్వడంతో పాటు వేగం పుంజుకుందని వెల్లడించారు. డిజిటల్ టెక్నాలజీ వల్ల సుపరిపాలన సాధ్యమైందని.. అవినీతి కూడా తగ్గిందన్నారు. కాకా ఈ సదస్సులో మన పోరుగ దేశమైన శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే తో పాటు 31 దేశాల నుంచి మంత్రులు,124 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గ్లోబల్ సైబర్ పాలసీలో అంతర్గతంగా, మానవ హక్కుల ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు సుమారు 10 వేలమంది ప్రతినిధులు హాజరవుతారు. ఇంటరాక్టివ్ మోడ్లో ప్రపంచ వ్యాప్తంగా 2800 మంది పాల్గొంటారు.