PM Kisan Scheme: రూ.55-రూ.200 కట్టండి.. నెలకు రూ.3 వేలు పెన్షన్ పొందండి.. రైతులకు మాత్రమే

వృద్ధాప్యంలో ఉన్న రైతులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.. 18 - 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ రైతు అయినా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2021, 02:09 PM IST
  • నెలకు రూ.3 వేలు పొందే పెన్షన్ స్కీం
  • రైతులకు ఆసరాగా తీసుకొచ్చిన స్కీం
  • 60 ఏళ్ల దాటిన రైతులకు నెలకు రూ.3 వేల పెన్షన్
PM Kisan Scheme: రూ.55-రూ.200 కట్టండి.. నెలకు రూ.3 వేలు పెన్షన్ పొందండి.. రైతులకు మాత్రమే

PM Kisan Scheme Farmers to Get Rs 3000 Monthly Pension: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (Pradhan Mantri Kisan Samman Nidhi) స్కీం కింద, రైతుల ఆర్థిక ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ. 6,000 చొప్పున మూడు విడతలుగా రూ. 2,000 పంపిణీ చేయనుంది. 

ఇప్పటి వరకు 9 విడతలుగా రూ.18వేలు రైతుల బ్యాంకు ఖాతాలో జమకాగా ఇప్పుడు 10వ విడతకు సమయం ఆసన్నమైంది.

ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన కింద, 60 ఏళ్ల వయసు దాటిన రైతులకు పెన్షన్ ఇవ్వబడుతుంది. ఒకవేళ ఇప్పటికే మీరు PM కిసాన్ స్కీం దరఖాస్తు చేసుకుంటే.. ప్రస్తుత్తం ఎలాంటి ఎలాంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. 

Also read: Corona Update in India:భారీగా తగ్గిన కరోనా కేసులు.. గడిచిన 287 రోజుల్లో ఇదే అత్యల్పం

వృద్ధాప్యంలో ఉన్న రైతులకు ఉపయోగపడాలని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.. 18 - 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ రైతు అయినా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద, రైతుకు నెలకు రూ. 3,000 వరకు పెన్షన్ లభిస్తుంది.

ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందేందుకు, రైతులు నెలవారీగా రూ.55 నుండి రూ.200 వరకు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఖాతాదారుడు మరణించిన తర్వాత, అతని జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ లభిస్తుంది మరియు 60 ఏళ్లు దాటిన తరువాత నెలవారీగా పెన్షన్ పొందుతారు. 

మన్ధన్ యోజన కోసం అవసరమైన పత్రాలు:

1) ఆధార్ కార్డ్ (Aadhaar Card)

Also read: Samantha Remuneration: 'పుష్ప'లో ఐటెం సాంగ్ కోసం రూ.1.5 కోట్లు తీసుకుంటున్న సమంత..??

2)  గుర్తింపు కార్డు (Identity Card)

3)  ఏజ్ సర్టిఫికేట్ (Age Certificate)

4) ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate)

5)  క్షేత్రానికి చెందిన ఖస్రా ఖాతౌని (Khasra Khatauni of the field)

6) బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ (Bank Account Passbook)

7) మొబైల్ నంబర్ (Mobile Number)

8) పాస్‌పోర్ట్ సైజు ఫోటో (Passport Size Photo)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News