న్యూఢిల్లీ: పెట్రోల్, ఢీజిల్ ధరల్లో శుక్రవారం స్వల్ప తగ్గుదల కనిపించింది. లీటర్ పెట్రోల్ ధర 10-15 పైసల వరకు తగ్గగా డీజిల్ ధర లీటర్కు 8-14 పైసలు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.94 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.65.81గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 10 పైసలు తగ్గి, రూ. 76.72 వద్ద ఉండగా లీటర్ డీజిల్ ధర 8 పైసలు తగ్గి 68.91 గా వుంది. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 75.26 గా వుండగా లీటర్ డీజిల్ ధర రూ.71.44 గా ఉంది. ఇక విజయవాడలో ఇంధనం ధరల విషయానికొస్తే, లీటర్ పెట్రోల్ ధర రూ 74.68 గా వుండగా లీటర్ డీజిల్ ధర రూ.70.50 గా వుంది. మొత్తంగా 45 రోజుల క్రితం రూ.90 వరకు చేరుకున్న ఇంధనం ధరలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుండటం వాహనదారులకు ఒకింత ఊరటనిస్తోంది.