Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు, ఎప్పుడంటే

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆన్ షెడ్యూల్ జరగనున్నాయి. నెలరోజులపాటు నిర్వహించేలా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. కరోనా సంక్రమణ కారణంగా షెడ్యూల్‌లో కుదింపు జరిగిందని తెలుస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 29, 2021, 04:33 PM IST
 Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు, ఎప్పుడంటే

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆన్ షెడ్యూల్ జరగనున్నాయి. నెలరోజులపాటు నిర్వహించేలా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. కరోనా సంక్రమణ కారణంగా షెడ్యూల్‌లో కుదింపు జరిగిందని తెలుస్తోంది. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ (Parliament Monsoon Session)విడుదలైంది. జూలై నెలలో వర్షాకాల సమావేశాల్ని నిర్వహించేందుకు పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫారసు చేసింది. జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకూ దాదాపు నెల రోజులు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. వర్షాకాల సమావేశాల్ని కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ పాటిస్తూ నిర్వహించనున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కనీసం ఒక డోసును అందరు సభ్యులు తీసుకుని ఉంటారని భావిస్తూ..వ్యాక్సిన్ (Vaccine)వేయించుకున్నవారికే పార్లమెంట్లో ఎంట్రీ ఉండేలా నిబంధనలు జారీ చేసే అవకాశాలున్నాయి. దాదాపు నెలరోజులు జరిగే మాన్‌సూన్ సెషన్స్‌లో 20 సిట్టింగ్స్ ఉండవచ్చని తెలుస్తోంది. సాధారణంగా ఎప్పుడూ జూలై నెలలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతుంటాయి. అయితే గత ఏడాది మాత్రం కరోనా కారణంగా సెప్టెంబర్ నెలలో నిర్వహించారు.ఈసారి మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఉంటాయని స్పష్టమైంది.

Also read: Gaganyaan Yatra: గగన్‌యాన్ యాత్ర డిసెంబర్ నెలలోనే..మార్పు లేదని స్పష్టం చేసిన ఇస్రో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News